Home /News /jobs /

TSSPDCL RECRUITMENT 2022 ALERT FOR THE UNEMPLOYED ISSUANCE OF NOTIFICATION FOR JOB VACANCIES FROM THE ELECTRICITY DEPARTMENT DETAILS EVK

TSSPDCL Recruitment 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఎల‌క్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వివ‌రాలు

(ఫ్రతీకాత్మక చిత్రం)

(ఫ్రతీకాత్మక చిత్రం)

TSSPDCL Recruitment 2022 | తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. విద్యుత్ శాఖ‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ tssouthernpower.cgg.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.  ఈ పోస్టులకు సంబంధించి తొలుత అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)  విభాగంలో నోటిఫికేషన్ విడుదల అయ్యింది.  ఈ నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్   tssouthernpower.cgg.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.

    Drone Pilot: భ‌విష్య‌త్‌లో ల‌క్ష‌మంది డ్రోన్ పైలెట్లు అవ‌స‌రం.. డ్రోన్ పైలెట్ అవ్వ‌డం ఎలా?

    పోస్టు వివరాలు..















    పోస్టుఅర్హతలుపే స్కేల్ఖాళీలు
    అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో లేదా రాష్ట్ర చట్టం (లేదా) గుర్తింపు పొందిన సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ / AICTE (లేదా) ఏదైనా ఇతర అర్హత దానికి సమానమైనదిగా గుర్తించబడిన యూనివర్సిటీ పరిధిలో ఎలక్ట్రికల్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి, ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. (లేదా) A.M.I.E యొక్క సెక్షన్-‘A’ & ‘B’లో ఉత్తీర్ణత. పరీక్ష ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి.రూ.64295-2655-69605-3100-85105-3560-9934570





    ముఖ్యమైన తేదీలు..

    ఆన్‌లైన్ పేమెంట్ ప్రారంభం - 12.05.2022
    ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం - 12.05.2022
    ఆన్‌లైన్ ఫీజు చెల్లింపున‌కు ఆఖ‌రు తేదీ 03.06.2022 (upto 5:00 pm)
    ఆన్‌లైన్ అప్లికేష‌న్‌కు ఆఖ‌రు తేదీ 03.06.2022 (upto 11:59 pm)
    హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం - 11.07.2022
    ప‌రీక్ష తేదీ - 17.07.2022

    Ts Jobs: నిరుద్యోగుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. 13,000 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్‌

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://tssouthernpower.cgg.gov.in ను సంద‌ర్శించాలి.

    Step 3 - అనంత‌రం మొద‌ట ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేయాలి.

    Step 4 - పేమెంట్ త‌రువాత అప్లికేష‌న్ ఫాంలో త‌ప్పులు లేకుండా విద్యార్హ‌త వివ‌రాలు అందించాలి.

    Step 5 - అనంత‌రం అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేసి.. హార్డ్ కాపీని భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం దాచుకోవాలి.

    Step 6 - ద‌ర‌ఖాస్తుకు జూన్ 3, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Job notification, JOBS, Jobs in telangana, Ts jobs, TSSPDCL

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు