తెలంగాణ విద్యుత్ శాఖ 201 ఖాళీలను భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. అందులో ఈ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల దరఖాస్తుకు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం. ఈ నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ tssouthernpower.cgg.gov.in ను సందర్శించాల్సి ఉంటుంది.
TS Govt Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 1,326 పోస్టులతో ఆ శాఖలో నోటిఫికేషన్ విడుదల
పోస్టు వివరాలు..
పోస్టు | అర్హతలు | పే స్కేల్ | ఖాళీలు |
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో లేదా రాష్ట్ర చట్టం (లేదా) గుర్తింపు పొందిన సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ / AICTE (లేదా) ఏదైనా ఇతర అర్హత దానికి సమానమైనదిగా గుర్తించబడిన యూనివర్సిటీ పరిధిలో ఎలక్ట్రికల్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి, ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. (లేదా) A.M.I.E యొక్క సెక్షన్-‘A’ & ‘B’లో ఉత్తీర్ణత. పరీక్ష ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. | రూ.45205-2225-56330-2655-69605-3100-85105-3560-88665 | 201 |
Jobs in Aadhar: హైదరాబాద్ యూఐడీఏఐలో రూ.9లక్షల ప్యాకేజీతో జాబ్స్.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ 15.06.2022 (upto 5:00 pm)
ఆన్‌లైన్ అప్లికేషన్‌కు ఆఖరు తేదీ 05.07.2022 (upto 11:59 pm)
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం - 23.07.2022
పరీక్ష తేదీ - 31.07.2022
Job News: ఆ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు.. కరోనా తరువాత మారిన పరిస్థితి
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్సైట్ http://tssouthernpower.cgg.gov.in ను సందర్శించాలి.
Step 3 - అనంతరం మొదట ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేయాలి.
Step 4 - పేమెంట్ తరువాత అప్లికేషన్ ఫాంలో తప్పులు లేకుండా విద్యార్హత వివరాలు అందించాలి.
Step 5 - అనంతరం అప్లికేషన్ సబ్‌మిట్ చేసి.. హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
Step 6 - దరఖాస్తుకు జూలై 5, 2022 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2022, JOBS, Ts jobs, TSSPDCL