TSSPDCL Application Steps: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 జాబ్స్... అప్లికేషన్ స్టెప్స్ ఇవే

TSSPDCL Application Steps: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 జాబ్స్... అప్లికేషన్ స్టెప్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

TSSPDCL Recruitment 2019 | ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాల్సిన బాధ్యత మీదే. ఏవైనా తప్పులు చేస్తే సరిచేసుకునే అవకాశం ఉండదు. అందుకే ప్రతీ వివరాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది.

  • Share this:
    తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL. మొత్తం 2500 జూనియర్ లైన్‌మెన్-JLM, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-JACO, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్-JPO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 3025 ఖాళీలు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే దరఖాస్తు విషయంలో అభ్యర్థులకు కొన్ని సందేహాలు, అనుమానాలున్నాయి. ఎలా దరఖాస్తు చేయాలి? పేమెంట్ ఎలా చేయాలి? అన్న డౌట్స్ ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ గురించి నోటిఫికేషన్‌లో డీటెయిల్డ్‌గా వివరించింది TSSPDCL. మూడు పోస్టులకు వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతల గురించి తెలుసుకోవాలి. ఇక దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    ముందుగా tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. జూనియర్ లైన్‌మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉంటాయి. నోటిఫికేషన్ ఓపెన్ చేసి పూర్తిగా చదవండి. మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే ముందుగా ఫీజు పేమెంట్ చేయాలి. ఇది మొదటి స్టెప్. Online Payment Link ఓపెన్ చేసి వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. ఫీజు చెల్లించిన వారికి జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్‌ను గుర్తుంచుకోవాలి. ఫీజు పేమెంట్ సమయంలో సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫీజు పేమెంట్ పూర్తి చేసి జర్నల్ నెంబర్ పొందిన తర్వాత రెండో స్టెప్ ఉంటుంది. ఇది అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రాసెస్.

    రెండో స్టెప్‌లో Online Application Link ఓపెన్ చేయాలి. జర్నల్ నెంబర్‌తో పాటు ఫీజు పేమెంట్ వివరాలను ఎంటర్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సూచించిన సైజ్‌లోనే ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్హతలు, అదనపు అర్హతలు, స్థానికత లాంటి వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. చివరగా వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఎక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. దీంతో రెండో స్టెప్ పూర్తవుతుంది. రెండు స్టెప్స్ పూర్తయ్యాయంటే దరఖాస్తు ప్రక్రియ ముగిసినట్టే. మీ దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి విద్యార్హతలు, చివరి తేదీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఆన్‌లైన్ దరఖాస్తులో వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాల్సిన బాధ్యత మీదే. ఏవైనా తప్పులు చేస్తే సరిచేసుకునే అవకాశం ఉండదు. అందుకే ప్రతీ వివరాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం మంచిది. మీరు దరఖాస్తు ఫామ్‌లో వివరాలను పూర్తిగా ఎంటర్ చేయకపోతే దరఖాస్తు ఫామ్ రిజెక్ట్ అవుతుంది. దరఖాస్తు చివరి తేదీ గుర్తుంచుకొని అంతలోపే ఫామ్ సబ్మిట్ చేయాలి. చివరి నిమిషంలో అప్లికేషన్ పూర్తి చేయొచ్చనుకుంటే సాంకేతిక సమస్యలు రావచ్చు. ఆన్‌లైన్ సబ్మిషన్‌లో, హాల్ టికెట్స్ డౌన్‌లోడ్స్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ డెస్క్ 040-23120303 నెంబర్‌కు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు కాల్ చేయొచ్చు.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ జాబ్‌కు అప్లై చేశారా? ఉద్యోగానికి సెలెక్ట్ చేసేది ఇలాగే

    Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4,805 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

    Indian Army Jobs: ఇంటర్, బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్

     
    First published: