హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSSET 2022: టీఎస్ సెట్ పరీక్షల తేదీలు విడుదల.. పూర్తి వివరాలివే

TSSET 2022: టీఎస్ సెట్ పరీక్షల తేదీలు విడుదల.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 కు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు విడుదల చేశారు. మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Warangal

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS SET - 2022) నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు (Application) ప్రక్రియ డిసెంబరు 30 నుంచి ప్రారంభం కాగా.. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగింది. తాజాగా తెలంగాణ స్టేట్-స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2022 కు సంబంధించిన పరీక్ష తేదీలను అధికారులు విడుదల చేశారు.

మార్చి 13, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపునకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Exams, JOBS, Telangana government jobs, Ts set

ఉత్తమ కథలు