తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఒకేషనల్ జూనియర్ కాలేజీని (Vocational College) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెన్త్ పాసైన విద్యార్థులు ఈ కోర్సులో (Vocational Courses) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT), ఫిమేల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW), ఫిజియోథెరపీ (PT) కోర్సుల్లో ఈ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కాలేజీని (College) సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఇతర వివరాలకు 7382835579, 9573637594 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్లను ఈ నెల 30న క్లోజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL), ఆన్ లైన్ మోడ్లో పొందిన డిగ్రీలు.. రెగ్యులర్ డిగ్రీలతో సమానమేనని తేల్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. UGC రెగ్యులేషన్ 22 (ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కొవిడ్ పాండమిక్ తర్వాత ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్ లైన్ మోడ్ ద్వారా డిగ్రీలు అందుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూజీసీ తాజా నిర్ణయంతో ఈ తరహా డిగ్రీ పొందేందుకు అభ్యర్థులు మరింత ఆసక్తి కనబర్చే అవకాశం ఉంది.
ADMISSION Closing by 30th September.Hurry Up Candidates,Do not Miss the Chance.@Govardhan_MLA @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/ldRpdNQWUH
— Dr.N.Shailaja Murthy (@DoctorNShailaja) September 11, 2022
తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఓపెన్, ఆన్ లైన్ మోడ్లో డిగ్రీ పూర్తి చేసే వారు సంప్రదాయ పద్ధతి అయిన రెగ్యులర్ మోడ్లో డిగ్రీ చేసే వారితో సమానం కానున్నారు. అయితే కొన్ని కోర్సుల్లో నమోదు చేసుకున్న వారికి ఫీల్డ్ ఎక్స్పీరియెన్స్, గ్రౌండ్ లెవల్ ఎక్స్పోజర్ అవసరం కావచ్చు. వీరు రెగ్యులర్ డిగ్రీ పట్టభద్రుల మాదిరిగానే అన్ని రకాల ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించొచ్చు.
గుర్తింపు ఉంటేనే..
ఇప్పటికే పలు విద్యా సంస్థలు ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) మోడ్లో ఆన్ లైన్లో పలు కోర్సులు అందిస్తున్నాయి. అయితే విద్యార్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో మాత్రమే డిగ్రీ కోర్సులు పూర్తి చేయాలి. కొన్ని కోర్సులు ఆన్ లైన్ మోడ్లో అందించడానికి వీలు లేకుండా యూజీసీ నిషేధం విధించింది. ఆ జాబితాలో ఇంజినీరింగ్, మెడికల్, ఫిజియోథెరపీ వంటి కోర్సులు ఉన్నాయి. యూజీసీ తాజా నిర్ణయంతో విద్యా సంస్థలు మరిన్ని కోర్సులను డిస్టెన్స్, ఆన్ లైన్ మోడ్లో అందించే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, Career and Courses, Colleges, JOBS, Tsrtc