Home /News /jobs /

TSRTC MANAGEMENT HAS DECIDED TO PROVIDE FREE TRANSPORT FACILITY TO THE CANDIDATES APPEARING FOR TODAY UPSC PRELIMS EXAM PRV

RTC: ​ సివిల్స్​ అభ్యర్థులకు గుడ్​న్యూస్​.. పరీక్ష రాయడానికి వెళ్లే వారికి ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు ఎండీ సజ్జనార్​ ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూపీఎస్​సీ ప్రిలిమ్స్ (UPSC Prelims) 2021 కోసం 10-అక్టోబర్ -2021 (అంటే నేడు) హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయం అందించడానికి టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది.

    యూపీఎస్​సీ ప్రిలిమ్స్ (UPSC Prelims) 2021 కోసం 10-అక్టోబర్ -2021 (అంటే నేడు) హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా సదుపాయం అందించడానికి టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్​ జంట నగరాలు, వరంగల్లోని ట్రై సిటీస్​లో మెట్రో, AC బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా (Free transport) సేవను పొందవచ్చు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా సివిల్ (civil) సర్వీస్ ఎగ్జామినేషన్ -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు (candidates) TSRTC  శుభాకాంక్షలు తెలియజేసింది.

    లక్షల మంది పోటీ..


    దేశంలో ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS) వంటి 19 ఉన్నత స్థాయి కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు జాతీయ స్థాయిలో నిర్వహించే మూడంచెల ప్రక్రియ సివిల్స్​! తొలి దశ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఏటా లక్షల మంది ప్రతిభావంతులు పోటీపడుతుంటారు. ఈ ఏడాది మొత్తం 712 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 10వ తేదీన నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు యూపీఎస్సీ ఇప్పటికే అడ్మిట్‌ కార్డులు(హాల్‌ టికెట్లు) జారీ చేసింది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

    పరీక్ష గురించి కొన్ని విషయాలు..


    సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్‌ అర్హత పరీక్ష (Qualifying exam) మాత్రమే. అయితే ఇది ఎంతో కీలకమైంది. పరీక్ష రాసేవారిలో 2 నుంచి 3 శాతం మంది మాత్రమే మెయిన్‌కు ఎంపికవుతారు. సివిల్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు ఒక్కో పేపరు 200 మార్కులకు చొప్పున మొత్తం 400 మార్కులకు ప్రిలిమ్స్‌ నిర్వహిస్తారు. ప్రతి పేపరుకు పరీక్ష సమయం రెండు గంటలు.

    పేపర్‌ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీసం 33శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పేపర్‌ 2లో.. కాంప్రెహెన్షన్‌; ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌–కమ్యూనికేషన్‌ స్కిల్స్‌; లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ; డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లం సాల్వింగ్‌; జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ; బేసిక్‌ న్యూమరసీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్‌కు అర్హత సాధించే క్రమంలో.. పేపర్‌ 1 అత్యంత కీలకం. ఇందులో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు; భారత చరిత్ర, జాతీయ ఉద్యమం; భారత–ప్రపంచ జాగ్రఫీ; ఇండియన్‌ పాలిటీ–గవర్నెన్స్‌; ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌; ఎన్విరాన్‌మెంట్‌; జనరల్‌ సైన్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

    ఈ ఏడాది సివిల్స్‌లో ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువ. 712 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 1:13 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌కు ఎంపిక చేస్తారు. కరోనా వల్ల ఇంటి నుంచే పని చేస్తున్న వర్కింగ్‌ పీపుల్‌ కూడా సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. కాబట్టి ఈసారి పోటీ తీవ్రంగా ఉండవచ్చు. అభ్యర్థి సాధించే ప్రతి మార్కు వారి విజయాన్ని నిర్ణయిస్తుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Buses, Busstand, Exams, Sajjanar, Students, Tsrtc, UPSC

    తదుపరి వార్తలు