TSRJC CET 2020: గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

TSRJC CET 2020 | తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 దరఖాస్తు గడువు జూలై 10 వరకు పొడిగించారు.

news18-telugu
Updated: May 28, 2020, 5:35 PM IST
TSRJC CET 2020: గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో చేరాలనుకునే టెన్త్ విద్యార్థులకు శుభవార్త. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ గడువును పెంచింది తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ-TREIS. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియస్ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TSRJC CET 2020 పేరుతో ఈ పరీక్ష జరగనుంది. వాస్తవానికి ఈ ఎగ్జామ్ మే 10న జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. పరీక్ష వాయిదా వేయడంతో దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశం ఇస్తోంది సొసైటీ. ఆసక్తి గల విద్యార్థులు జూలై 10 వరకు అప్లై చేయొచ్చు. ఆ తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ తేదీని ప్రకటించనుంది TREIS.

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం TSRJC CET 2020 జరగనుంది. వీటిలో 20 బాలికల కళాశాలలు కాగా, 15 బాయ్స్ కాలేజీలు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను సంప్రదించొచ్చు.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... మే 31 చివరి తేదీ

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Published by: Santhosh Kumar S
First published: May 28, 2020, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading