TSPSC WARNS CANDIDATES IF FALSE PROPAGANDA ON SOCIAL MEDIA WILL NOT WRITE THE TEST EVK
TSSPSC Jobs: అభ్యర్థులకు అలర్ట్.. అలా చేస్తే పరీక్షలు రాయకుండా నిషేధిస్తాం: టీఎస్పీఎస్సీ
ప్రతీకాత్మక చిత్రం
TSPSC Job | అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (KCR) ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన వెంటనే.. నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలు తీస్తున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఓ ప్రకటన చేసింది.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ (KCR) ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసిన వెంటనే.. నిరుద్యోగులు మళ్లీ పుస్తకాలు తీస్తున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధమవుతన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల అంశంలో టీఎస్పీఎస్సీపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఇలా చేస్తే పరీక్షలు రాయకుండా అభ్యర్థులపై నిషేధం విధిస్తామని చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అభ్యర్థులెవరూ ఆలోచించకుండా పోస్టులు పెట్టడం, ఎవరో పంపించినవి ఫార్వర్డ్ చేయరాదని సూచించారు.
ఉచితంగా కోచింగ్‌లు..
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింద. ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ-శాట్ ఛానెళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. టీశాట్ నిపుణ, టీశాట్ విద్య అనే రెండు ఛానెళ్లు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఈ టీవీ ఛానెళ్లలో పోటీ పరీక్షలకు పాఠాలు చెబుతారు. మీ ఇంట్లో కూర్చునే ఈ పాఠాలు వినొచ్చు.. స్వయంగా నోట్స్ తయారు చేసుకొని.. పరీక్షలకు సన్నద్ధమవ్వచ్చు.
అంతేకాదు కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇవి ఏర్పాటైతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ మొత్తం పోస్టుల్లో 11,626 గ్రూప్ - I, II, III, IV సర్వీసుల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ I – 503, గ్రూప్ II – 582, గ్రూప్ III – 1373, గ్రూప్ IV – 9168 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. రెగ్యులర్, డిస్టన్స్ విధానంలో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులెవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువమంది ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారు ఉంటారని అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.