టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి ఇటీవల 581 పోస్టులకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో ట్రైబల్, బీసీ సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్ట్ లు, దివ్యాంగ్, సీనియర్ సిటిజన్ విభాగంలో వార్డెన్,మేట్రన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హాస్టల్ వెల్ ఫేర్ గ్రేడ్ 1 అండ్ 2, మాట్రాన్ గ్రేడ్ - 1 అండ్ 2, వార్డెన్ గ్రేడ్ 1 అండ్ 2, లేడీ సూపరింటెండెంట్, చిల్డ్రెన్ హోమ్ విభాగాల్లో ఈ పోస్టులను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నారు. మొత్తం 581 పోస్టులకు జనవరి 6, 2023 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. గడువు ముగిసే నాటికి 581 ఖాళీలకు గాను.. మొత్తం 1,45,358 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నియామక పరీక్ష ఆగస్టులో ఉండే అవకాశం ఉందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్-4 దరఖాస్తు ప్రక్రియ సైతం ఈ రోజే ముగిసింది. గడువు ముగిసే నాటికి మొత్తం 9,51,321 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 8,180 ఖాళీలకు గాను ఈ దరఖాస్తులు వచ్చాయి.
భారీగా అప్లికేషన్లు రావడంతో పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లను ప్రారంభించింది. జులై 1న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటి దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కాగా.. వీటికి దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2023న ముగియనున్నాయి.
TSPSC Group 1 Mains Exam Dates: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే
గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18, 2023 నుంచి ప్రారంభం అయింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ ముగింపు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2023 వరకు ఉంటుంది. గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ జనవరి 24న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 23, 2023 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.