హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Online Application: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లింక్ ఓపెన్..

TSPSC Online Application: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లింక్ ఓపెన్..

TSPSC Online Application: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లింక్ ఓపెన్..

TSPSC Online Application: అభ్యర్థులకు అలర్ట్.. రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లింక్ ఓపెన్..

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన పోస్టులకు సంబంధించి ఇటీవల రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన పోస్టులకు సంబంధించి ఇటీవల రెండు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా మొత్తం 57 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో నాన్ గెజిటెడ్ పోస్టులు(Non Gazetted) 25, గెజిటెడ్(Gazetted) పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. వీటిలో గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 06, 2022 నుంచి ప్రారంభం కానుంది. అంటే రేపటి నుంచి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. డిసెంబర్ 27, 2022 వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గెజిటెట్ పోస్టులు 32

పోస్టుల వివరాలిలా..

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 01

అసిస్టెంట్ కెమిస్ట్ - 04

అసిస్టెంట్ జియోఫిజిస్ట్ - 06

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ - 16

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ - 05

అర్హతలు..

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్..  మెటీరియాలజీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమేటిక్స్ లేదా అప్లైడ్ మేథమేటిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ కెమిస్ట్..  కెమిస్ట్రీ లేదా అప్లైడ్ కెమిస్ట్రీలో డిగ్రీ కలిగి ఉండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులు. వీటితో పాటు.. పీజీ కూడా ఉండాలి.

అసిస్టెంట్ జియోఫిజిస్ట్..  జియో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్..  జియాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్..  సివిల్ ఇంజనీరింగ్ లో జియోలజీ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండాలి. లేదా హైడ్రాలజీలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం నెలకు రూ.45,960- రూ. 1,33,630 చెల్లిస్తారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించండి..

SSC CHSL Notification: ఇంటర్ అర్హతతో.. SSC నుంచి భారీ పోస్టులతో రేపే నోటిఫికేషన్ విడుదల..

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..

- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

-ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది గెజిటెడ్ పోస్టులు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

-దీని ద్వారా టీఎస్పీఎస్సీ ఐడీని ఎంటర్ చేయాలి.

-తర్వాత ఓపెన్ అయిన మరో పేజీలో అర్హత వివరాలను నమోదు చేస్తే.. మీ అప్లికేషన్ పూర్తయినట్లే.

-అప్లికేషన్ లింక్ డిసెంబర్ 06, 2022 ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతుందని వెబ్ సైట్లో పేర్కొన్నారు.

నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు .. 

డిసెంబర్ 07, 2022 నుంచి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఇలా..

నాన్ గెజిటెడ్ పోస్టుల వివరాలిలా..

1. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) - 07

2. టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ ) - 05

3.టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) - 08

4. ల్యాబ్ అసిస్టెంట్ - 01

5.జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 04

Teacher Jobs: 13 వేల ఉపాధ్యాయ కొలువులు.. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు ప్రారంభం అయిన దరఖాస్తుల ప్రక్రియ..

అర్హతలు..

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజిస్ట్) ..  జియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజిస్ట్ )..  సివిల్ ఇంజనీరింగ్ లో జియాలజీ అనేది ఒక సబ్జెక్ట్ ఉండాలి. లేదా హైడ్రాలజీలో రెండేళ్ల ఎమ్సెస్సీ పూర్తి చేసి ఉండాలి.

టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్)..  జియో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎంటెక్ లో జియో ఫిజిక్స్ పూర్తి చేసిన వారు అర్హులు.

ల్యాబ్ అసిస్టెంట్.. కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్..  జియాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా మ్యాథమేటిక్స్ లేదా జియాలజీ ఒక సబ్జెక్ట్ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ.51320-రూ.96890 చెల్లిస్తారు. రాతపరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 28.12.2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు