హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం..

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం..

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

ప్రతీకాత్మక చిత్రం (image: TSPSC)

అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రారంభించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డిసెంబర్ 31న తెలంగాణ రవాణ శాఖలోని అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 113 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధిచిన దరఖాస్తు ప్రక్రియను తాజాగా ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుకు ఫిబ్రవరి 1ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం ఇలా..

Step 1: మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2: హోం పేజీలో Applications for the Post Of ASSISTANT MOTOR VEHICLES INSPECTOR IN TRANSPORT DEPARTMENT లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: తర్వాత ఓపెన్ అయిన పేజీలో టీఎస్పీఎస్సీ ఐడీని ఎంటర్ చేయాలి. దీంతో పాటు.. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

Step 4: తదుపరి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.

Step 5: దీనికి ఎంటర్ చేయగానే.. అప్లికేషన్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను సరి చూసుకోవాలి. తర్వాత అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.

Step 6: తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

విద్యార్హతల వివరాలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ లేదా అటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొంది ఉండాలి. లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వయస్సు 21-39 ఏళ్లు ఉండాలి.

First published:

Tags: JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు