ఇటీవల టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన ఎక్సటెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ జనవరి 08, 2023న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(Extension Officer) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి టీఎస్‌పీఎస్సీ ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 26 వేలకు పైగా దరఖాస్తులు (Applications) వచ్చాయి. సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.
ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించి హాల్ టికెట్స్ ను విడుదల చేసింది. ఓఎమ్ఆర్ విధానంలో ఆఫ్ లైన్ లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే సమయానికి వారం రోజుల ముందు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ పేర్కొనగా.. తాజాగా నేటి నుంచి అడ్మిట్ కార్డులను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు.
ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు నిర్వహించనున్నారు. దీనిలో 150 మార్కులకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ విభాగంలో 150 నిమిషాల్లో 150 ప్రశ్నలను గుర్తించాల్సి ఉంటుంది. మరో పేపర్ సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి మొత్తం 150 ప్రశ్నలను 150 నిమిషాల్లో గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రెండు భాషల్లో(తెలుగు, ఇంగ్లీష్ ) ఉంటుంది.
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఇలా..
Step 1 : ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : ఇక్కడ అభ్యర్థి యొక్క టీఎస్పీఎస్సీ ఐడీని ఎంటర్ చేయాలి. దీంతో పాటు.. డేట్ ఆఫ్ బర్త్ తేదీని ఎంటర్ చేయాలి.
Step 3 : కింద పేర్కొన్న క్యాప్షా ను ఎంటర్ చేసి.. డౌన్ లోడ్ పీడీఎఫ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
Step 4 : మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనిని ప్రింట్ అవుట్ తీసుకొని సెంటర్ వివరాలను సరి చూసుకోవాలి.
Tags: JOBS, TSPSC, Tspsc jobs