తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. నిన్న పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయగా నేడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసింది. 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విద్యార్హతలు తదితర పూర్తి వివరాలు పూర్తి నోటిఫికేషన్లో ఉండనున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి నోటిఫికేషన్ ను త్వరలో అధికారిక వెబ్ సైట్లో అప్లోడ్ చేయనుంది.
ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
Indian Navy SSR Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 1400 జాబ్స్ .. రేపటి నుంచే దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..
ఇందుకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. అభ్యర్థులు ఈ నెల 14 నుంచి టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.in వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC