Home /News /jobs /

TSPSC RELEASED JOB NOTIFICATION FOR SENIOR ASSISTANT JUNIOR ASSISTANT CUM TYPIST VACANCIES HERE FULL DETAILS NS

Telangana Govt Jobs: ఆ ఉద్యోగాల భర్తీకి TSPSC నుంచి నోటిఫికేషన్.. తెలంగాణలో మొదలైన కొలువుల జాతర

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్‌సీ గుడ్ న్యూస్ చెప్పింది. పీవీ నరసింహారావు, జయశంకర్ యూనివర్సిటీల్లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సైతం ఇటీవల బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ విషయంపై మరో మారు ప్రకటన చేశారు. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నట్లు అసెంబ్లీలో చెప్పారు. ఈ మేరకు అధికారులు మొత్తం ఖాళీల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ముగిసిన అనంతరం వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు ఉద్యోగాల ప్రకటనలు విడుదల అవుతాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులు ప్రిపరేషన్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. పీ.వీ.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో పలు ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది.

    ఈ రెండు యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 127 పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. పీ.వీ.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు-15, ఇదే యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌-10 పోస్టులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌ పోస్టులు102 ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ గురిచి నోటిఫికేషన్లో పేర్కొనలేదు. ఏప్రిల్ 1 సాయంత్రం 5 గంటల నుంచి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్‌సీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని కమిషన్ తెలిపింది. అయితే ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

    ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఖాళీల సంఖ్య 55 వేలకు చేరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. దీంతో మరో 5 వేల ఖాళీలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. అయితే మొత్తం ఉద్యోగాల్లో పోలీసు శాఖలోనే దాదాపు 20 వేల ఖాళీలు ఉన్నాయి. అయితే అంత మొత్తంలో నియామకాలు చేపడితే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు సదుపాయాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతో మొదటగా 15 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తారని తెలుస్తోంది. మిగిలిన ఖాళీలకు తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Govt Jobs 2021, Harish Rao, Job notification, Telangana, TSPSC

    తదుపరి వార్తలు