Home /News /jobs /

TSPSC RELEASED GROUP 1 NOTIFICATION HERE IMPORTANT DATES AND DETAILS NS

TSPSC Group 1 Notification: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని ఖాళీలంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ ను TSPSC తాజాగా విడుదల చేసింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ ను TSPSC ఈ రోజు విడుదల చేసింది. మొత్తం 503 ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల గ్రూప్ 1 కు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో కేవలం 900 మార్కులకే మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.

    దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించున్నారు. ప్రిలిమ్స్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి డిటైయిల్డ్ నోటిఫికేషన్ ను ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే మే 2న విడుదల చేయనున్నారు అధికారులు.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
    జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు- 5
    అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు- 40
    అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు-38
    అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌- 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్)
    డీఎస్పీ- 91
    జైళ్లశాఖలో డీఎస్పీ పోస్టులు- 2
    మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి- 121
    జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు- 5



    సీటీఓ- 48
    డిప్యూటీ కలెక్టర్లు- 42
    అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 26
    ప్రాంతీయ రవాణా అధికారి- 4
    అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌- 8
    జిల్లా ఉపాధి అధికారి- 2
    జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు- 6
    గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు- 35
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు