హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు

TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు

TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు
(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Recruitment 2022: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్... 833 ఖాళీలు (ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Recruitment 2022 | టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో 833 ఖాళీలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana | Hyderabad

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2022 అక్టోబర్ 21 చివరి తేదీ. డీటెయిల్డ్ నోటిఫికేషన్ 2022 సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ నోటీస్‌లో ఈ కింది వివరాలు ఉన్నాయి.

TSPSC Recruitment 2022: ఖాళీల వివరాలివే

 మొత్తం ఖాళీలు 833
 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్) 62
 అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 41
 అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 13
 మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 29
 టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 09
 అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్) 03
 అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 227
 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్) 12
 అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) 38
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 27
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 68
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 32
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 212
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) 60

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 5,008 జాబ్స్ ... అప్లై చేయండి ఇలా

TSPSC Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల- 2022 సెప్టెంబర్ 23

దరఖాస్తు ప్రారంభం- 2022 సెప్టెంబర్ 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 21

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా పాసైనవారు అప్లై చేయొచ్చు.

వయస్సు- 18 నుంచి 44 ఏళ్ల లోపు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

వేతనం- రూ.1,24,150 వరకు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs, Telangana jobs, TSPSC