హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Notification: నిరుద్యోగులకు అలర్ట్... 833 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Notification 2022 | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21 లోగా అప్లై చేయాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్. ఇటీవల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 833 పోస్టులతో మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2022 అక్టోబర్ 21 లోగా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

TSPSC Recruitment 2022: ఖాళీలు, విద్యార్హతల వివరాలివే

 మొత్తం ఖాళీలు 833విద్యార్హతలు
 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్) 62 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 41 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 13 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 29 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 09 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్) 03 సివిల్ ఇంజీరింగ్‌లో బీఈ లేదా బీటెక్
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్)- 1212 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)38 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్)142 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్)35 డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ (ఐ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్)50 డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)68 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)31 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్ HOD)1 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 147 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 65 డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) 53 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ HOD) 07 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్

Top 10 Skills To Get Job: ఉద్యోగ సాధనలో ఉపయోగపడే టాప్ 10 నైపుణ్యాలు ఇవే.. నివేదిక విడుదల చేసిన లింక్డ్‌ఇన్ ..

TSPSC Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2022 సెప్టెంబర్ 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటలు

ఎగ్జామ్- 2023 జనవరి లేదా ఫిబ్రవరి

వయస్సు- 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, ఎన్‌సీసీ సేవలు అందించినవారికి 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు + రూ.80 ఎగ్జామినేషన్ ఫీజు

వేతనం- అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.45,960 బేసిక్ వేతనంతో మొత్తం రూ.1,24,150. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.32,810 బేసిక్ వేతనంతో మొత్తం రూ.96,890.

జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IT Jobs 2022: ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా.. ఈ కంపెనీలో 10 వేల ఖాళీలకు నియామకాలు..

TSPSC Recruitment 2022: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Application for the post of AE (16/2022) లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి.

Step 4- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి.

Step 5- మీ వన్ టైన్ రిజిస్ట్రేషన్ వివరాలన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయి. వివరాలన్నీ

Step 6- సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.

Step 7- ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Govt Jobs 2022, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు