హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Recruitment 2021: గుడ్ న్యూస్... తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

TSPSC Recruitment 2021: గుడ్ న్యూస్... తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

TSPSC Recruitment 2021 | టీఎస్‌పీఎస్‌సీ ఓ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

TSPSC Recruitment 2021 | టీఎస్‌పీఎస్‌సీ ఓ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

TSPSC Recruitment 2021 | టీఎస్‌పీఎస్‌సీ ఓ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పొడిగించింది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC ఓ నోటిఫికేషన్ దరఖాస్తు గడువును పొడిగించింది. తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి గతంలోనే టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదట జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు మే 5 లోగా దరఖాస్తు చేయాలని వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు 10 శాతం ఎకనమికల్లీ వీకర్ సెక్షన్-EWS రిజర్వేషన్ అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీఎస్‌పీఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి తాజాగా టీఎస్‌పీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  తాజా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 19న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 20 వరకు అవకాశం ఉంది. పోస్టుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 127 ఖాళీలు ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేసినవారు కూడా అప్లికేషన్ అప్‌డేట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ చూడండి.

  DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

  Jobs in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని డిక్సన్ టెక్నాలజీస్‌లో 150 ఉద్యోగాలు

  TSPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 127

  సీనియర్ అసిస్టెంట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 15

  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 10

  జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- 102

  Teacher Jobs: మొత్తం 3479 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 10 రోజులే గడువు

  NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో 50 ట్రైనీ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

  TSPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 19

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 20

  విద్యార్హతలు- డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పాస్ కావాలి. లేదా బీసీఏ డిగ్రీ పాస్ కావాలి. లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు టైప్‌రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ పాస్ కావాలి.

  వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు

  ఎగ్జామ్ ఫీజు- రూ.200

  ఎంపిక విధానం- రాతపరీక్ష

  పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్.

  First published:

  Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana jobs, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tspsc jobs, Upcoming jobs

  ఉత్తమ కథలు