TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు... జనవరి 25 లాస్ట్ డేట్

TSPSC Food Safety Officer Recruitment 2020 | టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

news18-telugu
Updated: January 23, 2020, 12:50 PM IST
TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు... జనవరి 25 లాస్ట్ డేట్
TSPSC Jobs: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు... జనవరి 25 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 36 ఖాళీలను ప్రకటించింది. అందులో 26 పోస్టులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-GHMC పరిధిలో ఉండగా, మిగతా 10 పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్-IPM ల్యాబ్‌లో నియమించనుంది తెలంగాణ ప్రభుత్వం. టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2020 జనవరి 25 చివరి తేదీ. అభ్యర్థులు ముందుగా టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.

TSPSC Food Safety Officer Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 36

జీహెచ్ఎంసీ- 26
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్- 10
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 6


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 25విద్యార్హత- ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీలో డిగ్రీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ, మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి.
వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం- రూ.28,940-రూ.78,910
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

SBI Jobs: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 7870 ఉద్యోగాలు... ఎగ్జామ్ సిలబస్ ఇదే

Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 6060 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Indian Railways: విద్యార్థులకు భారతీయ రైల్వే నుంచి అద్భుత అవకాశం
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు