టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకంగా అత్యంత ప్రతిష్మ్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పేపర్ దాదాపు 100 మంది అభ్యర్థులకు ముందే తెలిసిందన్న విషయం బయటకు రావడంతో కమిషన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణపై కమిషన్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందిన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్న లక్ష్యంతో కమిషన్ పలు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉద్యోగులెవరూ కూడా ఆఫీస్ లోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురాకుండా ఉండేలా నిబంధనలను మార్చనుంది. ఇప్పటివరకు అభ్యర్థులు దరఖాస్తులు లేక ఏమైనా తప్పులు దొర్లితే నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసేవారు. దీంతో వారు ఆఫీసు లోని ఉద్యోగులతో నేరుగా సంప్రదించడం, ఫోన్ నంబర్లు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవారు. అయితే.. ఇక మీదట అభ్యర్థులెవరూ ఆఫీసుకు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఇక మీదట ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించే ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతోంది కమిషన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Paper leak, Telangana government jobs, TSPSC