హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-1 Prelims Results: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే!

TSPSC Group-1 Prelims Results: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు (TSPSC Gropu-1 Results) ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా న్యాయపరమైన అడ్డంకులు రావడంతో ఫలితాల విడుదల సాధ్యం కాలేదు. అయితే.. ఫలితాల విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రంలోగా ఫలితాలను విడుదల చేయాలన్నది టీఎస్పీఎస్సీ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది. అయితే, ఏదైనా సాంకేతిక కారణాలతో ఈ రోజు ఫలితాల విడుదల ఆలస్యం అయితే.. రేపు తప్పనిసరిగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ (TSPSC) భావిస్తోంది. ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు.

తెలంగాణలో 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించింది. నవంబర్ 15న తుది కీని సైతం విడుదల చేసింది. అయితే.. రిజర్వేషన్ల విషయంలో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లిన కారణంగా కొన్నాళ్లు గందరగోళం ఏర్పడింది. అనంతరం ఓ అభ్యర్థి స్థానికత అంశంపై కోర్టుకు వెళ్లడంతో మరికొన్ని రోజులు ఫలితాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే.. హైకోర్టు తాజాగా ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఒక్క అభ్యర్థి విషయంలో దాదాపు లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రిజల్ట్స్ ను ఆపడం సరికాదని అభిప్రాయపడింది. దీంతో ఫలితాల విడుదలకు మార్గం సుగమైంది.

TSPSC Notification: వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు .. 148 పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..

మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తం 25,150 మందిని ఎంపిక చేయనున్నారు. మొత్తం 503 ఖాళీల కోసం నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కు మొత్తం 2,86,051 మంది హాజరయ్యారు. అందులో బబ్లింగ్‌, ఇతర నిబంధనలు పాటించని 135 మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పెట్టింది. ఇంకా.. మిగిలిన 2,85,916 మంది అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయనున్నారు.

First published:

Tags: Group 1, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు