TSPSC PLANS TO INTRODUCE E QUESTION PAPER SYSTEM LIKE COMPUTER BASED RECRUITMENT TEST HERE DETAILS NS
TSPSC: ఈ సారి గ్రూప్ 1 పరీక్షలో ఈ క్వశ్చన్ పేపర్ విధానం? పూర్తి వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ సారి గ్రూప్ 1 పరీక్షను (Exams) ఈ క్వశ్చన్ పేపర్ విధానంలో నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి గ్రూప్ 1 (TSPSC Group 1) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు తమ కలల కొలువైన గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ ను పరుగులు పెడుతున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ (TSPSC Group 1) ఇప్పటికే ఈ నెల 2 ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఈ నెల 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సారి ఎగ్జామ్ (Group 1 Exam) విధానంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
-సాధారణంగా TSPSC గ్రూప్-1 అభ్యర్థుల ఎంపిక రెండంచెల ప్రక్రియ ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ టెస్ట్ కాగా ఈ ఎగ్జామ్ ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన వారు మెయిన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది.
-అయితే.. కమిషన్ ఈ సారి ఈ క్వశ్చన్ పేపర్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ - CBT) విధానాన్ని ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఒక వేళ ఈ విధానాన్ని ప్రవేశ పెడితే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. TS Police, Group1 Jobs Application: తెలంగాణలో పోలీస్, గ్రూప్ 1 జాబ్స్ కు దరఖాస్తులు ప్రారంభం.. తొలిరోజు ఇలా..
-అభ్యర్థులు ఎగ్జామ్ కు హాజరైన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ ఐడీగా హాల్ టికెట్ నంబర్ ను వినియోగించాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ను ఎగ్జామ్ రోజే అందిస్తారు.
-లాగిన్ అనంతరం క్వశ్చన్ పేపర్ కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
పరీక్ష అనంతరం ఎగ్జామ్ పేపర్ ను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కమిషన్ కల్పిస్తుంది.
-ఒక వేళ ఈ క్వశ్చన్ పేపర్ విధానం అమలు సాధ్యం కాని పక్షంలో పాత పద్ధతిలోనే ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్ ను అభ్యర్థులకు అందించనుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.