హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక మలుపు..సిట్ ఏం చేయబోతుంది?

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక మలుపు..సిట్ ఏం చేయబోతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TSPSC Paper Leak: తీగ లాగితే డొంక కదిలిన చందాన టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. మొదట ఈ కేసు దర్యాప్తును బేగంబజార్ పోలీసులు మొదలుపెటగా..ఆ తర్వాత సిట్ (Special Investigation Team) చేతుల్లోకి వెళ్ళింది. సిట్ విచారణలో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కొంతమందిని తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయం ఒకటి తేలినట్లు సమాచారం. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

TSPSC Paper Leak: తీగ లాగితే డొంక కదిలిన చందాన టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. మొదట ఈ కేసు దర్యాప్తును బేగంబజార్ పోలీసులు మొదలుపెటగా..ఆ తర్వాత సిట్ (Special Investigation Team) చేతుల్లోకి వెళ్ళింది. సిట్ విచారణలో ఇప్పటికే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కొంతమందిని తమ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా కీలక విషయం ఒకటి తేలినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక అలాగే ఆమె భర్తతో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో రమేష్, షమీమ్, సురేష్ లను 3 రోజులుగా సిట్ విచారిస్తుంది. ఈ విచారణలో అనేక విషయాలపై సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగా ఆ ముగ్గురిలో రమేష్ అనే వ్యక్తి TSPSCలో పని చేసే ఓ బోర్డు సభ్యుని పీఏగా తెలుస్తుంది. అయితే ఇతనికి పేపర్ లీక్ అంశానికి..ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో భాగంగా 40 మందిని పైగా అధికారులు విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, ఆమె భర్త డాక్వా నాయక్ తో సంబంధాలున్న వారందరిని సిట్ పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా షమీమ్, రమేష్, సురేష్ లను 5 రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయని గుర్తించారు. రేణుక భర్త డాక్వా నాయక్ బ్యాంకు ఆర్ధిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు.

'బలగం' మూవీ చూడటానికి ఊరంతా ఒక్కటైంది..ఎక్కడంటే?

రేణుక భర్త డాక్వా నాయక్ డబ్బుల వసూలులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఏఈ పేపర్ లీక్ తో డాక్వా నాయక్ ఏకంగా రూ.25 లక్షలను వసూలు చేసినట్టు గుర్తించారు. నీలేష్, గోపాల్ నాయక్ లు పొలం తాకట్టు పెట్టి రూ.13.5 లక్షలను డాక్వా నాయక్ కు అందించినట్లు సిట్ గుర్తించింది. అలాగే రాజేందర్ అనే యువకుడు కూడా రూ.5 లక్షలు, శ్రీకాంత్ అనే వ్యక్తి రూ.7.5 లక్షలను డాక్వా నాయక్ కు ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నారని సిట్ తెలిపింది. మరి వెరీ కస్టడీకి ఇంకా సమయం ఉండడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ గ్రూప్ 1 పేపర్ లీక్ చేయగా..ఆ విషయం ఇటీవల బయటకు వచ్చిందని..అంతవరకు ఎవరికీ తెలియదని అంతా భావించారు. కానీ సిట్ దర్యాప్తులో దీనికి సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు ముందే గుర్తించారు.

MBBS Student Suicide: తెలంగాణలో మరో మెడికో సూసైడ్..హాస్టల్ గదిలోనే ఉరి వేసుకొని....

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్,ర్ రమేష్ లను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని..మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీనితో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. కాగా షమీమ్, రమేష్ ల నుండే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు 5 రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇవ్వగా మూడు రోజులు పూర్తయ్యాయి.

First published:

Tags: Hyderabad, JOBS, Telangana, Telangana government jobs, TSPSC, TSPSC Paper Leak

ఉత్తమ కథలు