news18-telugu
Updated: May 25, 2020, 11:51 AM IST
Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంచిన టీఎస్పీఎస్సీ
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB కోసం గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు మే 15న ముగిసింది. వాస్తవానికి నోటిఫికేషన్ ప్రకారం మార్చి 30న దరఖాస్తు గడువు ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా గడువును మే 15 వరకు పొడిగించింది టీఎస్పీఎస్సీ. కరోనా వైరస్ లాక్డౌన్ కొనసాగుతుండటంతో మరోసారి గడువు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 31 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 93 మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్పీఎస్సీ. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్పీఎస్సీ.పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.

Source: TSPSC
HMWSSB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 31
విద్యార్హత- సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.దరఖాస్తు ఫీజు- రూ.200
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్.
HMWSSB Recruitment 2020: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 93
మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79
మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06
మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04
మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03
మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
DRDO Jobs: డీఆర్డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు
Published by:
Santhosh Kumar S
First published:
May 25, 2020, 11:50 AM IST