Home /News /jobs /

TSPSC JOBS JOB REPLACEMENT IN TELANGANA WHICH IS BEING DELAYED DUE TO ROSTER POLICY KNOW DETAILS EVK

TSPSC Jobs: తెలంగాణ‌లో జాబ్ నోటిఫికేష‌న్ ఇంకా రాక‌పోవ‌డానికి ఇదీ అస‌లు కార‌ణం..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Jobs | సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా.. 80,039 పోస్టుల భ‌ర్తీకి అధికార ప్ర‌క‌ట‌న చేశారు. వెంట‌నే నియామ‌క ప్ర‌క్రియ చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే సీఎం చెప్పినా.. నోటిఫికేషన్ విడుదల ఆల‌స్యం అయ్యేలా ఉంది. అందుకు కార‌ణం రోస్ట‌ర్ విధానంపై ఇంకా స‌రైన విధానంపై ఇంకా పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు కాకపోవడం.. అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.

ఇంకా చదవండి ...
    సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీ వేదిక‌గా.. 80,039 పోస్టుల భ‌ర్తీకి అధికార ప్ర‌క‌ట‌న చేశారు. వెంట‌నే నియామ‌క ప్ర‌క్రియ చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే సీఎం చెప్పినా.. నోటిఫికేషన్ విడుదల ఆల‌స్యం అయ్యేలా ఉంది. అందుకు కార‌ణం రోస్ట‌ర్ విధానంపై ఇంకా స‌రైన విధానంపై ఇంకా పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు కాకపోవడం.. అనే అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.తాజాగా ఈ విష‌యంల‌పై తెలంగాణ (Telangana) సీఎస్ సోమేష్‌కుమార్ ఉన్న‌త స్థాయి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి వీలైనంత తొంద‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎస్సీ కోటాను 15శాతం వ‌ర‌కు పెంచింది. ఎస్టీ కోటాను 6 శాతం. 29శాతం బీసీ కోటాను నిర్ణ‌యించింది. మిగిలిన 50శాతం ఓసీ కోటాను నిర్ణ‌యించింది.  ఈ మేరకు రోస్టర్ విధానాన్ని రూపొందించాల్సి ఉంది.

    TSPSC Group 2 Exam Pattern: గ్రూప్ 2కు జాబ్ మీ లక్ష్యమా? అయితే.. ఎగ్జామ్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి

    సమస్య ఏమిటీ..
    రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇది వరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్‌ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్‌ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్‌ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్‌ (Multi Zonal) కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు.

    అదీగాక రోస్టర్‌ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప‌లు ఉద్యోగాల‌ను ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు.

    TSPSC Group 2: గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్.. పేపర్ 4 కోసం ఈ సిలబస్ చదవండి..

    రోస్ట‌ర్ విధానం అంటే..
    - ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్‌. రోస్టర్‌ పాయింట్లు 1 నుంచి 100 వరకు ఉంటాయి.

    - ఎలా అంటే.. జనరల్‌ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్‌ మహిళ, డిజేబుల్‌ జనరల్‌ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్‌ పాయింట్లలో నిర్ణ‌యిస్తారు.

    - ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్‌ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే.. ఏ పాయింట్‌ దగ్గర నియామకాలు పూర్తవుతాయో.. తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్‌ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, Telangana, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు