తెలంగాణలో సర్కారు కొలువుల మేళా (Telangana Government Jobs) సాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ కూడా పూర్తి కాగా, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్, ఈవెంట్స్ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం గ్రూప్-3, గ్రూప్-4 నియామకాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సాగుతోంది. గ్రూప్-3 కి సంబంధించి మొత్తం 1363 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్-3 దరఖాస్తుల ప్రక్రియను జనవరి 24న ప్రారంభించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). దరఖాస్తుకు ఫిబ్రవరి 23 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా గ్రూప్-3 (TSPSC Group-3) ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ ను విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఈ నోటిఫికేషన్లో గ్రూప్-3 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సిలబస్, ఎగ్జామ్ విధానం తదితర వివరాలను పొందుపర్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్-3కి సంబంధించి మొత్తం 450 మార్కులకు రాతపరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 3 పేపర్లు ఉండగా.. ఒక్కో పేపరుకు 150 మార్కులు ఉంటాయి.
Railway Recruitment 2022: దక్షిణ మధ్య రైల్వేలో 4 వేల జాబ్స్ .. తెలంగాణ , ఏపీలోనూ ఖాళీలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్
పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలు, పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ)-150 ప్రశ్నలు, పేపర్-3(ఎకానమీ & డెవలప్‌మెంట్)-150 ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్లో వెల్లడించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఒక్కో పేపర్ కు రెండున్నర గంటల సమయం ఉంటుందని పేర్కొంది. ప్రశ్నాప్రతం మొత్తం మూడు భాషల్లో.. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉంటుందని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 3, Job notification, JOBS, Telangana government jobs