Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు

RIMC Exam notification 2020 | రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

news18-telugu
Updated: March 31, 2020, 12:07 PM IST
Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు
Military College Admissions: మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్-RIMC లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువును పొడిగించాయి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC. ప్రస్తుతం ఆర్‌ఐఎంసీ జనవరి 2021 బ్యాచ్‌కు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తు సబ్మిట్ చేయడానికి 2020 మార్చి 31 చివరి తేదీ కాగా ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా గడువును పొడిగించడం విశేషం. అయితే చివరి తేదీ ఎప్పుడు అన్న విషయం వెల్లడించలేదు. ఆర్ఐఎంసీ-డెహ్రడూన్ త్వరలో చివరి తేదీని ప్రకటిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్‌ అడ్మిషన్ వివరాలు చూస్తే 8వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేయాలి. అంటే 7వ తరగతి చదువుతున్న, పాసైన విద్యార్థులు మాత్రమే ఆర్ఐఎంసీలో 8వ తరగతిలో అడ్మిషన్ల కోసం అప్లై చేయాలి. అబ్బాయిలు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వయస్సు 11.5 ఏళ్ల నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫామ్‌ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి నేరుగా పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తు ఫీజు డీడీ తీసి పంపాలి. http://www.rimc.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి ప్రాస్పెక్టస్ పొందొచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

ఆర్ఐఎంసీలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఫీజు సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.42,000 చెల్లిస్తే చాలు. భవిష్యత్తులో ఫీజు పెరిగే అవకాశముంది. అడ్మిషన్ సమయంలో సెక్యూరిటీ డిపాజిట్ రూ.20,000 చెల్లించాలి. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత రూ.20,000 రీఫండ్ ఇస్తారు. మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 నుంచి రూ.20,000 స్కాలర్‌షిప్.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: కరోనా వైరస్ ఎఫెక్ట్... ఈ పరీక్ష వాయిదా వేసిన యూపీఎస్‌సీ

Telangana Jobs: ఉద్యోగాల భర్తీకి హెల్త్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్TSPSC Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పొడిగింపు
Published by: Santhosh Kumar S
First published: March 31, 2020, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading