తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు సంబంధించి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థుల సంఖ్య 16381 మంది ఉండగా.. వీరిలో పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 9655. రెండు పేపర్లకు అటెండ్ అయిన అభ్యర్థుల సంఖ్య 9368 మంది. మెరిట్ లిస్ట్ లో పేరు లేని వారి సంఖ్య 287. మొత్తం 9368 అభ్యర్థులతో కూడిన మెరిట్ లిస్ట్ ను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. ఈ మెరిట్ లిస్ట్ నుంచే అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు ఒక్క పోస్టును ఇద్దరి చొప్పున పిలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను సందర్శించి తెలుసుకోవచ్చు.
ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(Food Safety Officers) పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 24 పోస్టులకు 16,381 దరఖాస్తులు(Applications) వచ్చాయి. దీనికి సంబంధించి ఆన్ లైన్ పరీక్ష(Online Exam) నవంబర్ 7, 2022 న నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రెస్పాన్స్ షీట్ తో పాటు కీని కూడా ఇటీవల విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
ఈ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో లోనే అభ్యంతరాలను నవంబర్ 20, 2022 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు. మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత నేడు (డిసెంబర్ 09, 2022)న ఫలితాలను వెల్లడించారు.
ఈ ఫలితాల్లో 300 మార్కులకు గాను 219.991 మార్కులతో కాళేశ్వరం జోన్ కు చెందిన ఓసీ అభ్యర్థి మొదటి ర్యాంక్ లో నిలిచాడు. రెండో స్థానంలో 210.657 మార్కులతో భద్రాద్రి కొత్తగూడెం జోన్ కు చెందిన బీసీ బీ మహిళా అభ్యర్థి నిలిచారు. మొత్తం 200 మార్కులకు పైగా 10 మందికి వచ్చాయి. వీటిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.