హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC DL Notification: అభ్యర్థులకు అలర్ట్.. డీఎల్ నోటిఫికేషన్ పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..

TSPSC DL Notification: అభ్యర్థులకు అలర్ట్.. డీఎల్ నోటిఫికేషన్ పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల (Jobs) భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. కళాశాల విద్యాశాఖ కింద డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఉద్యోగాల (Jobs) భర్తీకి డిసెంబరు 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ వాస్తవానికి జనవరి 31న ప్రారంభం కావాల్సి ఉండగా.. ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు. తర్వాత దీనిని మార్చి 20కు వాయిదా వేశారు. అయితే.. తాజాగా మరో సారి దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది.  త్వరలో తేదీని ప్రకటిస్తామని   తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

ఖాళీల వివరాలు:

1) అసిస్టెంట్ ప్రొఫెసర్స్: 491

- ఇంగ్లిష్ - 23

- తెలుగు - 27

- ఉర్దూ - 02

- సంస్కృతం - 05

- స్టాటిస్టిటిక్స్ - 23

- మైక్రోబయాలజీ - 05

- బయోటెక్నాలజీ - 09

- అప్లయిడ్ న్యూట్రీషన్ - 05

- కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ - 311

- కామర్స్-బిజినెస్ అనలిటిక్స్ (స్పెషలైజేషన్) - 08

- డెయిరీ సైన్స్ - 08

- క్రాప్ ప్రొడక్షన్ - 04

- డేటాసైన్స్ - 12

- ఫిషరీస్ - 03

- కామర్స్ (ఫారీన్ ట్రేడ్-స్పెషలైజేషన్) - 01

- కామర్స్(టాక్సేషన్-స్పెషలైజేషన్) - 06

2) ఫిజికల్ డైరెక్టర్: 29

3) లైబ్రేరియన్: 24

Junior Lecturer: అభ్యర్థులకు అలర్ట్.. JL పరీక్షపై హైకోర్టు కీలక ఆదేశాలు..

అయితే.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్(NET) లేదా సెట్(SET) లో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు సార్లు నెట్ పరీక్షను(NET Exam) నిర్వహిస్తారు. ఇప్పటికే నెట్ పరీక్ష, సెట్ పరీక్ష కూడా పూర్తయింది. వీటి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీనిలో అర్హత సాధించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలు విడుదల అయిన తర్వాత ఈ డీఎల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని అభ్యర్థులు కోరుతున్నారు.  టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: JOBS, Telangana jobs, TSPSC