తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 22, 2022న దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ (Notification) వెలువడింది. అయితే దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 6, 2022 నుంచి సెప్టెంబర్ 30, 2022 వరకు స్వీకరించారు. దీని ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను(Professors) భర్తీ చేస్తారు. మొత్తం 27 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమిస్తారు.
ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరికి ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ ) అనేది ఫిబ్రవరి 06, 2023 నుంచి ఫిబ్రవరి 08, 2023 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీఎస్పీఎస్సీ కోరింది.
ప్రొఫెసర్ పోస్టులు..
టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు 02 ఉన్నాయి. ఇవి వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 55 శాతం మార్కులతో ఎంఎస్సీ చేసి ఉండాలి. వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి. పీహెచ్‌డీ అభ్యర్థులు అయితే.. వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగాల్లో చేసి ఉండాలి. పని అనుభం 10 ఏళ్ల వరకు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్స్..
టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల్లో మరో విభాగం అసోసియేట్ ప్రొఫెసర్స్. ఇవి మొత్తం 04 ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. 55 శాతం మార్కులతో ఎంఎస్సీ అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్రీ/సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ ఫారెస్ట్ బయాలజీ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/ ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ & ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ వంటి సబ్జెక్టులో పీజీ ఉండాలి.
పీహెచ్‌డీ అయితే.. అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/ ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ లో అర్హత ఉండాలి. వీటితో పాటు.. నెట్/స్లెట్/సెట్ లో క్వాలిఫై అయి ఉండాలి. వీరికి కనీస అనుభవం 8 సంవత్సరాలు ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్..
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 21 ఉన్నాయి. జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్‌లైఫ్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Mulugu, TSPSC, Tspsc jobs