హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Alert: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఆ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల..

TSPSC Alert: టీఎస్పీఎస్సీ అలర్ట్.. ఆ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్పీఎస్సీ 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి తాజాగా హాల్ టికెట్స్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్పీఎస్సీ (TSPSC) 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి తాజాగా హాల్ టికెట్స్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో 185 వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్(Assistant Surgeon), హార్టిక‌ల్చ‌ర్ విభాగంలో 22 హార్టిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల‌కు డిసెంబర్ 30, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. దరఖాస్తులు ఫిబ్రవరి 15 వరకు స్వీకరించారు.

అయితే ఇటీవల ఈ పరీక్ష నిర్వహణ ఎప్పుడు నిర్వహించనున్నారనే తేదీని కూడా ఖరారు చేశారు. ఈ పరీక్షను మార్చి 15 ఉదయం, సాయంత్రం మరియు మార్చి 16న ఉదయం ఈ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. తాజాగా వీటికి సంబంధించి అడ్మిట్ కార్డులను టీఎస్పీఎస్సీ తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇతర పరీక్షల తేదీలు ఇలా..

హార్టికల్చర్ ఆఫీసర్..

ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా 22 హార్టికల్చర్ ఆఫీసర్(Horticulture Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 03 నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. తర్వాత ఫిబ్రవరి 08, 2023 నుంచి ఫిబ్రవరి 10, 2023 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ల ఎడిట్ కు అవకాశం కల్పించారు. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 04 ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

NEET 2023: నీట్‌కు ప్రిపేర్ అయ్యే వారికి అలర్ట్.. కొత్తగా వచ్చిన మార్పులివే.. ఓ లుక్కేయండి..!

అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్..

రవాణ శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఖాళీలకు ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 12న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 1ను ఆఖరి తేదీగా నిర్ణయించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ లేదా అటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా పొంది ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. వయస్సు 21-39 ఏళ్లు ఉండాలి.

పరీక్ష తేదీ: ఏప్రిల్ 23న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.

First published:

Tags: JOBS, TSPSC, Tspsc jobs

ఉత్తమ కథలు