ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(Food Safety Officers) పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 24 పోస్టులకు 16,381 దరఖాస్తులు(Applications) వచ్చాయి. దీనికి సంబంధించి ఆన్ లైన్ పరీక్ష(Online Exam) నవంబర్ 7, 2022 న నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి రెస్పాన్స్ షీట్ తో పాటు కీని కూడా విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ ను చూసుకోవడానికి డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేయవచ్చు. దీనిలో టీఎస్పీఎస్సీ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, క్యాప్షా కోడ్ ఎంటర్ చేయగానే.. మీ పరీక్ష పేపర్ తో పాటు.. జవాబులు కనిపిస్తాయి. వాటిని మీరు తనిఖీ చేసి.. మీ మర్కులను తెలుసుకోవచ్చు.
TSPSC నవంబర్ 7 వ తేదీని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ కంప్యూటర్ బేస్ట్ విధానంలో నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ నవంబర్ 15, 2022న అందుబాటులో ఉంచనున్నట్లు నవంబర్ 14నే టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. తాజాగా ఆ కీని కూడా విడుదల చేశారు అధికారులు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ లేదా.. టీఎస్పీఎస్సీ ఐడీ ద్వారా లాగిన్ అయి.. రెస్పాన్స్ షీట్స్ ద్వారా తమ మార్కులను తెలుసుకోవచ్చు.
ఈ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో లోనే రేపటి నుంచి అంటే.. నవంబర్ 16 నుంచి లింక్ ను ప్రొవైడ్ చేయనున్నారు. ఈ లింక్ ద్వారా మీరు అభ్యంతరం చేయవలసిన ప్రశ్నలకు తగిన ఆధారాలను పీడీఎఫ్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలకు చివరి తేదీ నవంబర్ 20, 2022 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వెబ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ తేదీ దాటిన తర్వాత వచ్చే అబ్జెక్షన్లను ఎట్టిపరిస్థితుల్లో పరిగణించబడవని కూడా తెలియజేశారు. అభ్యంతరాలను మెయిల్స్ ద్వారా గానీ.. ఫోన్ ద్వారా గానీ వ్యక్తం చేయకూడదని తెలిపారు. మరిన్ని వివరాల కోసం https://www.tspsc.gov.in ని సందర్శించొచ్చు.
నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫైనల్ కీ..
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ప్రైమరీ ఆన్సర్ కీతోపాటు ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఓటీఆర్ లాగిన్ ద్వారా ప్రాథమిక కీ, ఓఎమ్ ఆర్ పత్రాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయ్యి ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 29, 2022 సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే వెబ్ సైట్లో ఓఎంఆర్ పత్రాలను ఉంచనున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 2,85,916 ఓఎమ్ ఆర్ కాపీలను స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఈ కీపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను లేవనెత్తడానికి 5 రోజుల గడువు ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 31, 2022 నుంచి నవంబర్ 04, 2022 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించారు. అయితే దీనికి సంబంధించి ఫైనల్ కీ కూడా నేడు విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Final key, JOBS, Telangana government jobs, TSPSC