హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Exam Dates Announced: టీఎస్పీఎస్సీ 5 నోటిఫికేషన్స్.. పరీక్షల తేదీలు ఖరారు..

TSPSC Exam Dates Announced: టీఎస్పీఎస్సీ 5 నోటిఫికేషన్స్.. పరీక్షల తేదీలు ఖరారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎప్పీఎస్సీ నుంచి దాదాపు 25కు పైగా నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిలో జనవరిలో కొన్ని పరీక్షలు నిర్వహించిన టీస్పీఎస్సీ ఫిబ్రవరి, మార్చిలో కూడా కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలు ఖరారు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎప్పీఎస్సీ(TSPSC) నుంచి దాదాపు 25కు పైగా నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిలో జనవరిలో కొన్ని పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సీ ఫిబ్రవరి, మార్చిలో కూడా కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలు ఖరారు చేసింది. తాజాగా ఈ రోజు ఉదయం టీఎస్పీఎస్సీ బోర్డు (TSPSC Board) భేటీ కాగా.. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో గ్రూప్ 4 దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 03 వరకు పొడిగించగా.. మరో ఐదు నోటిఫికేషన్లకు(Notifications) సంబంధించి పరీక్ష తేదీలను ఖరారు చేశారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1.అగ్రికల్చర్ ఉద్యోగాలు ..

నేడు (జనవరి 30) అగ్రికల్చర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అయితే దీనిని నేడు భేటీ అనంతరం ఫిబ్రవరి 02, 2023వరకు పొడిగించారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభం అయింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 24న ఈ పరీక్షను నిర్వహించనన్నట్లు ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. దీనిని కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉదయం పేపర్ 01, సాయంత్రం పేపర్ 02 పరీక్షను నిర్వహించనున్నారు.

2. డ్రగ్స్ ఇన్ స్పెక్టర్..

డ్రగ్స్ కంట్రోట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ నుంచి డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 16, 2022న ప్రారంభం కాగా.. జనవరి 05, 2023 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిని ఓఎమ్ఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను మే 07, 2023న ఉదయం పేపర్ 01, సాయంత్రం పేపర్ 02 పరీక్ష ఉండనుంది.

3. పాలిటెక్నిక్ లెక్చరర్

పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల టీఎప్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 14న ముగిశాయి. దీనిని ఓఎమ్ఆర్ బేస్డ్ విధానంలో మే 13, 2023న ఉదయం పేపర్ 01, సాయంత్రం పేపర్ 02 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.

4. ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాలు..

ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులకు సంబంధించి ఇటీవల టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 128 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనిని కూడా కంప్యూటర్ బేస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 17, 2023న ఉదయం పేపర్ 01, సాయంత్రం పేపర్ 02 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.

5. లైబ్రేరియన్ ఉద్యోగాలు..

ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటి దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 17, 2023న ఉదయం పేపర్ 01, సాయంత్రం పేపర్ 02 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.

ఫిబ్రవరిలో దరఖాస్తుల ప్రక్రియ ముగిసే నోటిఫికేషన్ల వివరాలిలా..

టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన నోటిఫికేషన్లుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చాలా వరకు జనవరి నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే వీటి దరఖాస్తుల ముగింపు ప్రక్రియ ఫిబ్రవరిలో ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తులు ఏ తేదీన ముగుస్తున్నాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం..

1. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్

అందులో ముఖ్యంగా.. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. దీనికి దరఖాస్తుల స్వీకరణ జనవరి 12, 2023 నుంచి మొదలైంది. ముగింపు తేదీ ఫిబ్రవరి 01, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 06, 2023 ప్రారంభం అయింది. వీటి దరఖాస్తుల ప్రక్రియ ముగింపు తేదీ ఫిబ్రవరి 03, 2023గా ఉంది.

3. గ్రూప్ 4 ఉద్యోగాలు..

గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ జనవరి 30నే ముగియాల్సి ఉండగా..దీనిని మరో 5 రోజులు పొడిగిస్తూ.. ఫిబ్రవరి 03న చివరి తేదీగా పేర్కొన్నారు. ఇప్పటికే 8లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి దరఖాస్తులు 10 లక్షల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీటికి దరఖాస్తులు డిసెంబర్ 30, 2022 నుంచి మొదలయ్యాయి.

4. లైబ్రేరియన్ ఉద్యోగాలు..

ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటి దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

5. అకౌంట్స్ ఆఫీసర్

అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కాగా.. వీటికి దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2023న ముగియనున్నాయి.

6. గ్రూప్ 2 ఉద్యోగాలు..

గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18, 2023 నుంచి ప్రారంభం అయింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ ముగింపు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2023 వరకు ఉంటుంది.

7. గ్రూప్ 3 పోస్టులు

గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ జనవరి 24న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 23, 2023 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది.

First published:

Tags: JOBS, TSPSC