టీఎస్పీఎస్సీ ఇప్పటికే 4 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలను రద్దు చేయగా.. వాటికి సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించలేదు. ఒక్క గ్రూప్ 1 మాత్రం జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఏప్రిల్ 04న నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీ(TSPSC Paper Leak) ఎఫెక్ట్ భవిష్యత్ లో నిర్వహించాల్సి ఉన్న అనేక నియామక పరీక్షలపై పడింది. రానున్న ఏప్రిల్ నెలల్లో నిర్వహించాల్సి ఉన్న ఎగ్జామ్స్ (Jobs) అన్ని రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 04న నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కి వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ.
లీకేజీ కారణంగా.. ఇప్పటికే సిద్ధం చేసిన ప్రశ్నాపత్రాలను మార్చాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షతో పాటే ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సి ఉన్న 8 రకాల పోస్టుల నియామక పరీక్షలు కూడా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి టీఎస్పీఎస్సీ (TSPSC) త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం.
తెలంగాణలో గ్రూప్-1తో (TSPSC Group-1) పాటు డీఏఓ, ఏఈఈ పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ ను తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఏఈ పరీక్షను ముందుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఇక రద్దైన పరీక్షలకు సంబంధించి తాజా పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. డీఏఓ, ఏఈఈ, ఏఈ పరీక్షల తేదీలతో పాటు.. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించాల్సి ఉంది. వీటిపై నేడో రేపో ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana jobs, TSPSC