హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Exam Date: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఆ పోస్టులకు సంబధించి రాత పరీక్ష తేదీ ఖరారు..

TSPSC Exam Date: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఆ పోస్టులకు సంబధించి రాత పరీక్ష తేదీ ఖరారు..

TSPSC Exam Date: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఆ పోస్టులకు సంబధించి రాత పరీక్ష తేదీ ఖరారు..

TSPSC Exam Date: తెలంగాణలో ఉద్యోగాల జాతర.. ఆ పోస్టులకు సంబధించి రాత పరీక్ష తేదీ ఖరారు..

TSPSC Exam Date: తెలంగాణలో(Telangana) ఉద్యోగాల జాతం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఉద్యోగ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి.. మరో వైపు అప్లికేషన్ల గడువు ముగుస్తూనే ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సీఎం కేసీఆర్ అసెంబ్లీ(Assembly) సాక్షిగా ప్రకటించిన 80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 61 వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందగా.. టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి వాటికి సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించిన నిర్వాహకులు దీనికి సంబంధించి ఫైనల్ కీ అండ్ ఫలితాలను(Final Key And Results) కూడా వెల్లడించారు. రెండు లేదా మూడు రోజుల్లో పీఈటీకి సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసి.. డిసెంబర్ రెండో వారం నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష(Preliminary Exam) అక్టోబర్ 16న జరగ్గా.. దీనికి సంబంధిచి ఫైనల్ కీ విడుదల చేశారు. దీనిపై హారిజెంటల్ రిజర్వేషన్ గురించి కోర్డు కేసు ఉండగా.. ఈ ఫలితాలు ఆగిపోయాయి. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.

ఇదిలా ఉండగా.. టీఎస్పీఎస్సీ నుంచి వెల్లడైన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 1,06,263 దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తేదీని ఖరారు చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26 ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్ నోటీస్ ద్వారా టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

Jobs In ESIC: రూ.78,800 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు .. హైదరాబాద్ లో నియామకాలు..

DAO పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్స్ (గ్రేడ్-2) పోస్టులు మొత్తం 53 పోస్టులు. దీనిలో ఓసీ-19, ఈడబ్ల్యూఎస్-05, బీసీ-14, ఎస్సీ-09, ఎస్టీ-04, దివ్యాంగులు-02 కేటాయించారు.

జూలై 01, 2022 అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ కు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.

జీతం .. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు చెల్లిస్తారు.

Telangana Gurukul Notification: భారీగా పెరిగిన గురుకుల పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..

ఈ 53 పోస్టులను మల్టీ జోనల్ విధానంలో భర్తీ చేస్తారు. మల్టీ జోన్ 1లో 28, మల్టీ జోన్ 2లో 25 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 450 మార్కులు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2 అరిథ్‌మెటిక్ అండ్ మెన్సురేషన్ నుంచి 150 ప్రశ్నలకు 300 మార్కులను కేటాయించారు. ఈ పరీక్ష డిసెంబర్ లో ఉంటుంది.

First published:

Tags: JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు