తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. సిట్ అధికారులు దర్యాప్తులో కీలక వివరాలను రాబట్టారు. ఇప్పటికే ఏఈ పరీక్ష లీకైందని ప్రకటించిన అధికారులు దానిని రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా మార్చి 05న నిర్వహించిన ఏఈ పరీక్షతో పాటు.. దీని ముందు నిర్వహించిన దాదాపు 6 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక జూన్ 05 నుంచి జూన్ 13 వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అంతా వాయిదా పడనుంది. ఈ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి.
మొత్తం ఏఈ, డీఏఓ, గ్రూప్ 1, ఏఈఈ పరీక్షలను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. మిగిలిన సీడీపీఓ, ఏఓ వంటి పరీక్షలు కూడా లీకైనట్లు సిట్ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈ పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటితో పాటు.. మార్చి, ఏప్రిల్, మే నెలలో నిర్వహించతలపెట్టిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఏఎంవీఐ, జూనియర్ లెక్చరర్స్ వంటి పరీక్షలు కూడా వాయిదా వేశారు. ఇప్పటికే గ్రూప్ 4, గ్రూప్ 2 పరీక్ష తేదీలను ప్రకటించిన కమిషన్.. ఈ పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తారా.. లేదా అదే షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా.. అనేది టీఎస్పీఎస్సీ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే.. గ్రూప్ 1 పరీక్షలో ఇప్పటికే ఒక్క పోస్టులకు 50 మంది చొప్పును 25,000 మందిని మెయిన్స్ కు సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.