తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) 1540 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా దీనికి సంబంధించి వెబ్ నోటీస్ విడుదల చేసి.. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అప్లికేషన్స్(Applications) అనేవి సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 15, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించారు. తర్వాత గడువు పొడిగించాలంటూ అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో ఈ దరఖాస్తుల గడువును అక్టోబర్ 20కి పెంచారు. అయితే తాజాగా ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష హాల్ టికెట్స్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షను జనవరి 22, 2023వ తేదీన నిర్వహించనున్నట్లు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ కొరకు డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈఈ సివిల్ విభాగం 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147, టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో మొత్తం 704 ఖాళీలను గుర్తించారు. దీనిలో సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100 పోస్టులను కేటాయించారు.
ఇక ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 , ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులను గుర్తించారు. మొత్తం 1540 పోస్టులకు సంబంధించి ఖాళీలను ఈ నోటీస్ లో పేర్కొన్నారు.
అర్హతలు..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (మిషన్ భగీరథ), పీఆర్ అండ్ ఆర్ డీ విభాగంలోని ఏఈఈ పోస్టులు, ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో పోస్టులకు , టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్, టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఐ అండ్ సీఏడీ విభాగంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఐఅండ్ సీఏడీ విభాగంలో( మెకానికల్) ఏఈఈ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలోని పోస్టులకు ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం..
నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిచి తెలుసుకోవచ్చు.
రాతపరీక్ష..
మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS, TSPSC, Tspsc aee, Tspsc jobs