తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ (TSPSC Group-4 Notification) రానే వచ్చేసింది. 25 ప్రభుత్వ విభాగాల్లోని 9168 ఖాళీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన చరిత్ర లేదని అధికారులు చెబుతున్నారు. నిరుద్యోగులకు ఇది సువర్ణావకాశం అని వారు అంటున్నారు. మరో వైపు నోటిఫికేషన్ విడుదల కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు పుస్తకాల బాట పట్టారు. వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సెలవులు పెట్టి మరీ ప్రిపరేషన్ మొదలు పెట్టారు. గ్రూప్-4 ఉద్యోగాలకు (Jobs) దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే?
అయితే గ్రూప్-4 ఎగ్జామ్ ఎలా ఉంటుందనే చర్చ నిరుద్యోగుల్లో జోరుగా సాగుతుంది. అయితే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ ప్రకారం.. గ్రూప్-4 లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక్కో పేపర్ కు 150 మార్కులు.. మొత్తం రెండు పేపర్లకు కలిపి 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి స్థాయి నోటిఫికేషన్లో పోస్టుల వారీగా అర్హతల వివరాలు డిటైల్డ్ గా ఉంటాయి.
Telangana Jobs: తెలంగాణలో 208 ప్రొఫెసర్, అసిస్టెంట్ జాబ్స్ .. ఈ నెల 9న ఇంటర్వ్యూలు.. మెరిట్ ఉంటే చాలు..
పేపర్ 1: జనరల్ నాలెడ్జ్ (150 మార్కులు)
పేపర్ 2: సెక్రటేరియట్ ఎలిజిబిలిటీస్ (150 మార్కులు)
ఇదిలా ఉంటే.. గ్రూప్-4 కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభించనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల అంటే జనవరి 12, 2023ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో గ్రూప్-4 రాత పరీక్ష ఉంటుందని టీఎస్పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి డిటైల్డ్ నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది. నోటిఫికేషన్లో జిల్లాలు, రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలు ఉంటాయి. విద్యార్హతలు సైతం వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉండనున్నాయి. ఆ వివరాలు సైతం నోటిఫికేషన్ విడుదల తర్వాతనే తెలియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC