హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-4: గ్రూప్-4 కు భారీగా అప్లికేషన్లు.. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

TSPSC Group-4: గ్రూప్-4 కు భారీగా అప్లికేషన్లు.. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో 8039 గ్రూప్-4 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసింది. అయితే.. ఈ రోజు (జనవరి 28) సాయంత్రం వరకు మొత్తం 741159 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో 8039 గ్రూప్-4 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు (జనవరి 28) సాయంత్రం వరకు మొత్తం 7,41,159 మంది అభ్యర్థులు గ్రూప్-4 (TSPSC Group-4) ఖాళీల కోసం అప్లై చేసుకున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 30 నాటికి ముగియనుంది. దరఖాస్తులు ముగిసే నాటికి మొత్తం అప్లికేషన్ల సంఖ్య 8 లక్షలు దాటే అవకాశం ఉంది. మే నెలలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ – 3, 4 లలో పోస్టుల సంఖ్య పెరగనున్నాయి. టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి.. దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. కొత్తగా మంజూరయ్యే ఉద్యోగాలను కూడా ఈ ప్రకటనల్లోనే చేరుస్తామని కమిషన్ ఇప్పటికే చెప్పింది. తాజాగా బీసీ గురుకులాల్లో గ్రూప్-3 కింద 12, గ్రూప్-4 కింద 141 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని బీసీ సంక్షేమశాఖను టీఎస్పీఎస్సీ(TSPSC) కోరింది.

Government Jobs: అభ్యర్థులకు అలర్ట్.. ఈ 9 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశారా.. ఓ లుక్కేయండి..

ప్రతిపాదనలు అందిన వెంటనే వీటిని ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లో అదనంగా కలపనున్నారు. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ 2,391 ఉద్యోగాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటికే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు.. నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

First published:

Tags: Group 4, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు