త్వరలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటనతో తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. నిరుద్యోగులంతా మళ్లీ పుస్తకాలు చేత బట్టి ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఇతర ఉద్యోగాలతో పోల్చితే గ్రూప్ 2 (TSPSC Group 2) ఉద్యోగాలకు అత్యధిక పోటీ ఉంటుంది. వందల సంఖ్యలో ఖాళీలకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అబ్జెక్టివ్ విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం పరీక్షా విధానం, సిలబస్, టిప్స్ పై వరుస కథనాలను అందిస్తోంది న్యూస్18 తెలుగు. ఈ నేపథ్యంలో ఈ రోజు పేపర్ 3కి సంబంధించిన సిలబస్ కు సంబంధించిన వివరాలు..
గ్రూప్ 2 పేపర్ 3 సిలబస్ లో మూడు చాప్టర్లు ఉంటాయి..
1. భారతీయ ఆర్థిక వ్యవస్థ: సమస్యలు మరియు సవాళ్లు ( Indian Economy: Issues and Challenges)
2. తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి( Economy and Development of Telangana)
3. అభివృద్ధి మరియు మార్పు సమస్యలు (Issues of Development and Change)
TSPSC Group 2 Syllabus: టీఎస్పీఎస్సీ గ్రూప్2 అభ్యర్థులకు అలర్ట్.. పేపర్ 1 పూర్తి సిలబస్ ఇదే..
ప్రతీ చాప్టర్ లో మళ్లీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ వివరాలను కింద అటాచ్ చేసిన పీడీఎఫ్ లో చూడొచ్చు. ప్రతీ చాప్టర్ ను ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు సాధించవచ్చు. నాలుగు పేపర్లలో ఇది కొంచెం కష్టమైనదిగా చెప్పొచ్చు. అయితే, ప్రణాళికబద్ధంగా చదివితే ఈ పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు.
TSPSC Group 2 Syllabus: గ్రూప్2 కు ప్రిపేర్ అవుతున్నారా? ఇలా చదివితే పేపర్ 2పై పట్టు.. తెలుసుకోండి
గ్రూప్ II పరీక్షా విధానం గ్రూప్ 2 పరీక్ష మొత్తం రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనే రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఈ నాలుగు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
పేపర్ I - జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ II - చరిత్ర, రాజకీయాలు, సమాజం
పేపర్ III ఎకనామిక్స్ అండ్ డెవలప్మెంట్
పేపర్ IV - తెలంగాణ ఉద్యమం మరియు నిర్మాణం
పర్సనాలిటీ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూకు 60 మార్కుల వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC