TSPSC Group1 | స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్- ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం గ్రూప్-1కు ఇప్పటి వరకు 41,880 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు.
స్టేట్ సివిల్ పోస్టులుగా భావించే గ్రూప్- 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు 18 శాఖల్లో 503 గ్రూప్-1 పోస్టుల కోసం గ్రూప్-1కు ఇప్పటి వరకు 41,880 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రం వరకు 2,69,259 మంది వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటీఆర్) చేసుకున్నట్లు తెలిపారు. అయితే కొత్తగా ఓటీఆర్ చేసుకున్న వారు 85,777 మంది కాగా, సవరణ చేసుకున్నవారు మాత్రం 1,83,482 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ముఖ్యమైన సమాచారం..
- గ్రూప్-I పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా TSPSC యొక్క వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ఫారమ్‌ను పూరించాలి.
- ఇప్పటికే OTR ఫారమ్‌ను పూరించిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం దానిని సవరించాలి.
- మొత్తం 1,72,322 మంది అభ్యర్థులు తమ OTRని సవరించారు.
- మే 5, 2022 నాటికి TSPSCకి 79,406 కొత్త OTRలు అందాయి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి..
- టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.
- Personal Details సెక్షన్లో ఎస్ఎస్సీ లేదా తత్సమాన సర్టిఫికెట్లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.
- Address Details సెక్షన్లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
- మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
- Additional Qualifications సెక్షన్లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి.
TS Inter Exams 2022: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
- Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్పీఎస్సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.