Home /News /jobs /

TSPSC GROUP 1 SYLLABUS READY FOR GROUP 1 NOTIFICATION CELEBRATION DETAILS EVK

TSPSC Group-1 Syllabus: గ్రూప్‌-1 నోటిఫికేష‌న్‌కి స‌ర్వం సిద్ధం.. సెల‌బ‌స్ వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1: తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ (TSPSC Group 1) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలను సైతం తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో సెల‌బ‌స్ వివ‌రాలు..

    తెలంగాణలో గ్రూప్ 1కు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ (TSPSC Group 1) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలను సైతం తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. దీంతో పరీక్ష (Group 1 Exam) విధానం మరింత పారదర్శకంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన నాటి నుంచి గ్రూప్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ (TSPSC Notification) విడుదల కాలేదు. దీంతో ఈ సారి జరిగే గ్రూప్ 1 పరీక్షకు భారీగా పోటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏళ్లుగా లక్షలాది మంది అభ్యర్థులు గ్రూప్ 1 కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి వారు ప్రిపరేషన్ లో మరింత వేగం పెంచారు. మరికొంత మంది అభ్యర్థులు ప్రిపరేషన్ ను ప్రారంభించారు.

    ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం పేపర్ 2కు సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు..
    ఇందులో మొత్తం మూడు టాపిక్స్ ఉంటాయి.
    1.History and Culture of India, with special reference to Modern Period (భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి)
    2.History and Cultural Heritage of Telangana (తెలంగాణ చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వం)
    3. Geography of India and Telangana (భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక శాస్త్రం)
    ఈ పై టాపిక్స్ నుంచి మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
    TSPSC Group III: తెలంగాణలో 9,168 గ్రూప్ III ఉద్యోగాలు.. సిలబస్ ఇదే.. ఓ లుక్కేయండి



    "టెట్" స‌మ‌స్య త‌లెత్త‌కుండా పరీక్ష కేంద్రాల ఎంపిక.. 

    ఇటీవలే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తాయి. ఈ సారి అలాంటి అవ‌కాశం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సెంటర్ల కేటాయింపులో ప్రతి అభ్యర్థికి 8 నుంచి 10 ఆప్షన్లు ఇవ్వనున్నారు.

    Job Mela in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాబ్‌మేళా.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. వాక్ ఇన్ తేదీలు

    ఒక అభ్యర్థి 8 -10 వరకు జిల్లాలను ఎంపికచేసుకోవాలి. ప్రియారిటీ ప్ర‌కారం.. మొద‌టి ఆప్ష‌న్‌లో సీట్ లేకుంటే రెండో జిల్లాకు.. అక్క‌డ సీట్ లేకుంటే మూడో జిల్లాను కేటాయిస్తారు. దరఖాస్తు సమయంలో ప్రతి అభ్యర్థి 8-10 జిల్లాలను తప్పనిసరిగా ఆప్షన్స్‌గా ఎంచుకోవాలి. ఒకటి రెండు ఎంచుకుంటే ఇబ్బందులు తప్పవు.

    మూడు నెలలు  ఆదా..

    గ్రూప్ 1కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు ఉండేవి. రాత పరీక్షకు 900 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 1000 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించే వారు. గ్రూప్‌-2 విషయానికి వస్తే.. రాత పరీక్షకు 600 మార్కులు.. ఇంటర్వ్యూలకు 75 మార్కులు ఉండేవి. దీంతో మొత్తం 675 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉండేది.  దీంతో గ్రూప్‌-1ను 900 మార్కులకు, గ్రూప్‌-2ను 600 మార్కులకు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూలను రద్దు చేయడం వల్ల మూడు నెలలు  ఆదా అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Telangana government jobs, Ts government, Ts jobs, TSPSC

    తదుపరి వార్తలు