Home /News /jobs /

TSPSC GROUP 1 START THE GROUP 1 APPLICATION PROCESS FROM TODAY LEARN THESE THINGS EVK

TSPSC Group 1: నేటి నుంచి గ్రూప్‌-1 అప్లికేష‌న్ చేయాలి.. గుర్తుంచుకోవాల్సిన అంశాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌- ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   

    స్టేట్‌ సివిల్‌ పోస్టులుగా భావించే గ్రూప్‌- ఉద్యోగాలకు సంబంధించిన దర‌ఖా‌స్తు ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. 18 శాఖల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.   దాదాపు 18 శాఖ‌ల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల కోసం ఈ మే 31, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండగా.. ఇప్పటికే అధికారులు ఓటీఆర్‌లో మార్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు 1.40 లక్షల అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్‌లో మార్పులు చేసుకున్నారు.

    Wipro: అట్రిక్ష‌న్‌ల అడ్డుకొట్ట‌కు విప్రో కొత్త వ్యూహం.. ఏం చేయ‌నుంది..

    ఎన్ఓసీ తప్పనిసరి..

    గ్రూప్‌-1కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి శాఖాధికారి నుంచి నిర‌భ్యంత‌ర ప‌త్రం (ఎన్ఓసీ) స‌మ‌ర్పించాల‌ని టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా ప‌రీక్ష‌కు సంబంధించి మ‌రిన్ని సూచ‌న‌లు చేసింది.

    TS Police Job Preparation: పోలీస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టైం టేబుల్ ట్రై చేయండి

    - ప‌రీక్ష‌లో ఓఎమ్మార్‌పై హాల్‌టికెట్‌ను త‌ప్పుగా న‌మోదు చేయ‌కూడ‌దు. ఓఎమ్మార్‌సీట్‌పై, వైట్‌న‌ర్‌, బ్లేడ్ వంటి వాటిని ఉప‌యోగించొద్దు.

    - వ‌యోప‌రిమితికి సంబంధించి గ్రూప్‌-1కు పోటీ ప‌డేవారికి 2022 జూలై 1ని క‌టాఫ్‌గా నిర్దేశించారు.

    ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..

    - టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.

    ముఖ్యమైనది వ‌న్‌టైం రిజిస్ట్రేష‌న్ (ఓటీఆర్‌)లో స‌ర్టిఫికెట్ల అప్‌డేష‌న్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేర‌కు వెబ్‌సైట్‌లో మార్పులు కూడా చేసింది. ఓటీఆర్‌లో విద్యార్హ‌త వివ‌రాలు న‌మోదు చేస్తే స‌రిపోతుందని.. స‌ర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయ‌డం అభ్య‌ర్థుల ఇష్ట‌మ‌ని తెలిపింది. స‌ర్టిఫికెట్ అప్‌లోడ్ చేయ‌కున్నా.. ఓటీఆర్ ప్ర‌క్రియ విజ‌య‌వంతంగా పూర్త‌వుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై నిరుద్యోగ‌ల నుంచి హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. అయితే ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో ఒరిజిన‌ల్స్ చూపించాల్సి ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Telangana government jobs, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు