Home /News /jobs /

TSPSC GROUP 1 SPECIAL ACTIVITIES FOR GROUP 1 APPLICATIONS ESTABLISHED WITHOUT BURDEN ON TSPSC WEBSITE EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌పై భారం కాకుండా ఏర్పాటు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ శ‌రవేగంగా జ‌రిగేలా టీఎస్‌పీఎస్సీ చ‌ర్య‌లు చేప‌డుతుంది. వైబ్‌సైట్‌పై లోడ్ ప‌డ‌కుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుంది. అభ్య‌ర్థుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌లుగ‌కుండా ఓ టీం ను ఏర్పాటు చేశారు.

    గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ శ‌రవేగంగా జ‌రిగేలా టీఎస్‌పీఎస్సీ చ‌ర్య‌లు చేప‌డుతుంది. వైబ్‌సైట్‌పై లోడ్ ప‌డ‌కుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుంది. అభ్య‌ర్థుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌లుగ‌కుండా ఓ టీం ను ఏర్పాటు చేశారు. ప్ర‌తీ రోజు ఉదయం 2 నుంచి 3 గంట‌ల స‌మ‌యంలో ప‌ని చేస్తోంది. దీని ద్వారా గ్రూప్‌-1 అప్లికేష‌న్ 5 నుంచి 8 నిమిషాల్లో పూర్త‌వుతుంది. గ్రూప్‌-1కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు భారీగా వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 50,986 ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ట్టు అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. కొత్త‌గా 89,332 మంది ఓటీఆర్ న‌మోదు చేసుకొన్నారు. 1,90, 362 మంది ఓటీఆర్ ను ఎడిట్ చేసుకొన్నారు.

    ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ వేగ‌వంతంగా చేయ‌డానికి  ఏదైన స‌మ‌స్య వ‌చ్చిన‌ట్టు ఉంఏ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఎవ‌రైన అభ్య‌ర్థులు స‌మ‌స్య‌ల‌పై ఫోన్‌లు చేసిన వాటిని గుర్తించి ప‌రిష్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా అంద‌రూ ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో స‌ర్టిఫికెట్ల అప్‌లోడ్ చేయాల‌ని టీఎస్‌పీఎస్సీ నిర్ణ‌యించినా త‌రువాత ఆ నిర్ణ‌యాన్ని విర‌మించుకొంది. ఎంపికైన త‌రువాత స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌లో ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లు చూపిస్తే స‌రిపోతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

    ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి..

    టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్ ఓపెనింగ్స్‌.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    - హోమ్ పేజీలో కుడివైపు One Time Registration పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. Aadhaar Details సెక్షన్‌లో మొదట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

    - Personal Details సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ లేదా తత్సమాన సర్టిఫికెట్‌లో ఉన్నట్టుగా పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ లాంటి వివరాలన్ని ఎంటర్ చేయాలి.

    - Address Details సెక్షన్‌లో పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. Educational Qualifications సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Postal Department Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. తెలంగాణ. ఆంధ్రప్ర‌దేశ్ పోస్ట‌ల్ స‌ర్కిల్‌లో 2,942 ఉద్యోగాలు

    - మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ లాంటి అర్హతలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    - Additional Qualifications సెక్షన్‌లో అదనపు అర్హతల వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో సంతకం అప్‌లోడ్ చేయాలి.

    TS Inter Exams 2022: నేటి నుంచి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభం.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు..

    - Notification Alerts ఆన్‌లో పెడితే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత Preview క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    - ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే TSPSC ID జనరేట్ అవుతుంది. టీఎస్‌పీఎస్‌సీ ఏ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసినా TSPSC ID ఎంటర్ చేసి అప్లై చేయొచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు