Home /News /jobs /

TSPSC GROUP 1 PREPARING FOR GROUP 1 TOPIC WISE WEIGHTAGE PREPARATION TIPS DETAILS EVK

TSPSC Group-1: గ్రూప్‌-1 ప్రిపేర్ అవుతున్నారా.. టాపిక్‌ వారీగా వెయిటేజీ.. ప్రిప‌రేష‌న్ టిప్స్ వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లు, టాపిక్‌ల వారీగా ప్రశ్నల సంఖ్య వెయిటేజీపై అవగాహన పెంచుకోవాలి.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో 503 గ్రూప్ 1 (TSPSC Group 1) ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన చరిత్ర లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు ముందుగా సిలబస్‌లో పేర్కొన్న సబ్జెక్ట్‌లు, టాపిక్‌ల వారీగా ప్రశ్నల సంఖ్య వెయిటేజీపై అవగాహన పెంచుకోవాలి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. 150 మార్కులకు జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ పేరుతో పరీక్ష నిర్వహిస్తారు.

    TS Jobs: ఆ శాఖ‌లో ఉద్యోగాల‌కు వారం రోజులే చాన్స్‌.. ద‌ర‌ఖాస్తు విధానం.. గుర్తుంచుకోవాల్సిన అంశాలు

    ఇందులో మొత్తం 13 అంశాలను సిలబస్‌లో పేర్కొన్నారు. ఈ టాపిక్స్‌ అన్నీ కూడా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నవే. కాబట్టి ఒక్కో అంశం నుంచి 10 నుంచి 15 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

    స‌బ్జెక్టుల వారీగా మార్కుల వెయిటేజీలు..

    - టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ.. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో కీలక సబ్జెక్ట్‌గా హిస్టరీని పేర్కొనొచ్చు. ఇందులో భారతదేశ చరిత్రతోపాటు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, ఏపీపీఎస్సీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    - ఈ విభాగం నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. దీంతో.. అభ్యర్థులు హిస్టరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

    - పాలిటీ విభాగంలోనూ కోర్, సమకాలీన అంశాల కలయికతో 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

    TSSPDCL Recruitment 2022: జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా.. జిల్లాల వారీగా ఖాళీల వివ‌రాలు

    - ఎకానమీ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో ముఖ్యంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ–లక్షణాలు, జాతీయాదాయం, పంచవర్ష ప్రణాళికలు, పేదరికం–నిరుద్యోగం, వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామికాభివృద్ధి, సేవారంగ వృద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి.

    - జాగ్రఫీ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అంచనా వేయొచ్చు. ఇండియన్‌ జాగ్రఫీతోపాటు రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో, దేశంలో భౌగోళిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

    కరెంట్‌ అఫైర్స్, జీకే విభాగం నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని అంచనా. కోర్, కాంటెంపరీ అంశాల కలయికగానూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనికి విస్తృత అధ్యయనం అవసరం. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో.. పరీక్షకు ముందు çసంవత్సర కాలంలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Group 1, Jobs in telangana, Ts jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు