Home /News /jobs /

TSPSC GROUP 1 PREPARING FOR GROUP 1 JOBS READ THIS TOPIC BOOKS EVK

TSPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ఈ టాపిక్‌, బుక్స్ చ‌ద‌వండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TSPSC Group-1 Preparation | గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ  ప్రారంభమైంది.  ఇప్పటికే అభ్యర్థులు ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఇంత పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదల కాలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
    గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ  ప్రారంభమైంది.  ఇప్పటికే అభ్యర్థులు ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నారు.  అయితే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఉద్యోగ నియామక పరీక్షల్లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ప్రత్యేక పేపర్ ను నియామక పరీక్షల్లో చేర్చారు. గ్రూప్ -1 కు సంబంధించి సైతం ఈ పేపర్ ను యాడ్ చేశారు.

    ఇందులో..
    1) ది ఐడియా ఆఫ్ తెలంగాణ - The idea of Telangana (1948-1970)
    2)సమీకరణ దశ - Mobilisational phase (1971-1990)
    3)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం - Towards formation of Telangana State (1991-2014)
    ఈ పై మూడు చాప్టర్లు ఉంటాయి.
    TSPSC Group 1 Notification: తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల.. మొత్తం ఎన్ని ఖాళీలంటే?

    తెలుగు అకాడమీతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల నిపుణులతో పుస్తకాలు రూపొందించారన్నారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ రాసిన పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని  ఇటీవల అభ్యర్థులకు సూచించారు.  తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఈ ఏడేళ్లలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలని వివరించారు. తెలంగాణ బడ్జెట్, ఆవిర్భావం తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారడం లాంటి అంశాలు, కారణాల గురించి తెలుసుకోవాలన్నారు.

    Placements: ప్లేస్‌మెంట్ డ్రైవ్‌-2022లో రికార్డు.. ఆ విద్యార్థికి రూ. 62.72 లక్షల ప్యాకేజీ.. ఆ వివరాలు తెలుసుకోండి..

    ఉద్యమానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, కవులు, కళాకారుల పాత్ర, అత్యంత ప్రాచురణ పొందిన తెలంగాణ ఉద్యమ పాటలు, తెలంగాణ అమర వీరుల గురించి తెలుసుకుంటే ఈ పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రణాళిక బద్ధంగా, క్రమ పద్ధతిలో చదివితే ఈ పేపర్లో అధిక స్కోర్ రాబట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. T-SATలో సైతం TELANGANA MOVEMENTకు సంబంధించి పలు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. టీశాట్ అధికారిక వెబ్ సైట్లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మొత్తం 45 వీడియోలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ లింక్ https://www.tsat.tv/series/telangana-formation ద్వారా ఆ 45 వీడియోలను చూసి తెలంగాణ ఉద్యమంపై అవగాహన పెంచుకోవచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2022, Preparation, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు