Home /News /jobs /

TSPSC GROUP 1 PREPARATION TEST PROCEDURE AND TOPICS DETAILS TO READ EVK

TSPSC Group 1: గ్రూప్‌-1 ప్రిప‌రేష‌న్ స్టార్ట్ చేశారా.. ప‌రీక్ష విధానం.. చ‌ద‌వాల్సిన టాపిక్స్ వివ‌రాలు

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

TSPSC Group 1 | రాష్ట్ర ప్రభుత్వం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణ‌యించిన‌ప్ప‌టి నుంచి నిరుద్యోగుల్లో ఎక్కువ‌గా ఆస‌క్తి పెంచిన నోటిఫికేష‌న్ గ్రూప్‌-1. తాజాగా గ్రూప్‌-1 నియామ‌కాల‌కు సంబంధించి కీల‌క‌ జీవో 55 ను విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష విధానం.. చ‌ద‌వాల్సిన టాపిక్స్ వివ‌రాలు..

ఇంకా చదవండి ...
    రాష్ట్ర ప్రభుత్వం 80,039 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణ‌యించిన‌ప్ప‌టి నుంచి నిరుద్యోగుల్లో ఎక్కువ‌గా ఆస‌క్తి పెంచిన నోటిఫికేష‌న్ గ్రూప్‌-1. తాజాగా గ్రూప్‌-1 నియామ‌కాల‌కు సంబంధించి కీల‌క‌ జీవో 55 ను విడుద‌ల చేసింది. దీనిద్వారా గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, ఇతర క్యాటగిరీల పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన‌ట్ట‌యింది. ఉద్యోగాల భర్తీ విధానంలో పలు మార్పులు చేయటమే కాకుండా, పోస్టుల విభజన, పరీక్ష విధానాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జీవో 55ను జారీచేశారు. గతంలో జారీచేసిన జీవో 11ను సవరించి, కొత్త జీవోను విడుదల చేశారు. గ్రూప్‌ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్‌-2లో 16 రకాల పోస్టులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ప్రిపేర్ అయ్యేవారికి ప‌రీక్ష విధానం.. ఏం చ‌ద‌వాలో తెలుసుకోండి..

    TSPSC Group 1: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. ఖాళీల‌ భ‌ర్తీపై కీల‌క జీవో.. పోస్టుల వివ‌రాలు

    గ్రూప్ I పరీక్షా విధానం

    - తాజా నిబంధ‌న‌ల ప్ర‌కారం గ్రూప్​-1 రెండు ద‌శల్లో ఉంటుంది. ప్రిలిమ్స్​, మెయిన్స్. ఈ సారి ఇంట‌ర్వ్యూ తొల‌గించారు.

    - ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- జనరల్ స్టడీస్ అండ్​ మెంటల్ ఎబిలిటీ పేరుతో ఒకే పేపర్‌తో కూడిన ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష.

    - మెయిన్స్ ఎగ్జామినేషన్ - ఒక్కో పేపర్‌కు 150 మార్కుల వెయిటేజీతో ఆరు పేపర్లతో కూడిన డిస్క్రిప్టివ్ పరీక్ష.

    - ప్రిలిమినరీ ఎగ్జామినేషన్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్‌కు హాజరు కావడానికి అర్హులు.

    గ్రూప్‌ -1 మెయిన్స్‌ను 900 మార్కులు ఉంటుంది. గ‌తంలో ఇంట‌ర్వ్యూకి 100 మార్కులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల రద్దుతో గ్రూప్‌ -1లో 100 మార్కులు త‌గ్గాయి. 900 మార్కుల‌కే గ్రూప్‌-1 ఎంపిక ఉంటుంది.

    TS Police Jobs: ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు.. జిల్లాల వారీగా ఎస్సై.. కానిస్టేబుల్ ఖాళీల వివ‌రాలు

    చ‌ద‌వాల్సిన టాపిక్స్‌..

    కరెంట్ అఫైర్స్ - అభ్యర్థులు జాతీయ, రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. పరీక్షకు ముందు ఆరు నెలల కరెంట్ అఫైర్స్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి.

    జనరల్​ సైన్స్​ - 6 నుంచి 10వ తరగతుల వరకు గల ఎన్​సీఈఆర్​టీ సైన్స్ పాఠ్యపుస్తకాలను చదవాలి. అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

    ఎన్విరాన్​మెంటల్​ ఇష్యూస్​ అండ్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ - 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్యావరణ శాస్త్రాలపై ICSE పాఠ్యపుస్తకాలను బాగా చదవాలి. విపత్తు నిర్వహణ కోసం 8, 9, 10వ తరగతి NCERT పాఠ్యపుస్తకాలను చదవాలి.

    జాగ్రఫీ అండ్​ ఎకానమీ ఆఫ్​ ఇండియా, తెలంగాణ - ఇండియన్​ జాగ్రఫీ కోసం బ్లాక్‌స్వాన్ అట్లాస్ వంటి ప్రామాణిక అట్లాస్, 7 నుండి 10 తరగతుల వరకు NCERT పాఠ్యపుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. SSC సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు (6 నుండి 10వ తరగతి వరకు), 2021–22 ఆర్థిక సర్వే నివేదికపై పట్టు సాధించాలి. ఇది తెలంగాణ భౌగోళిక శాస్త్రం, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. NCERT 9వ తరగతి నుండి 12వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమికాంశాలను చదవవచ్చు.

    ఇండియన్ పాలిటీ - ఇండియన్​ పాలిటీ కోసం లక్ష్మీకాంత్ రచించిన ఇండియన్ పాలిటీ బుక్​ను చదవండి. దీనితో పాటు ఏదైనా ప్రామాణిక భారతీయ రాజకీయ పాఠ్యపుస్తకాన్ని కూడా చదవండి.

    Physical Measurements: ఎస్సై. కానిస్టేబుల్ ద‌రాఖాస్తు చేస్తున్నారా. పోస్టుల వారీగా ఫిజిక‌ల్ మెజ‌ర‌మెంట్స్ వివరాలు

    ఇండియన్​ హిస్టరీ - పురాతన, మధ్యయుగ, ఆధునిక భారతీయ చరిత్రల కోసం NCERT పుస్తకాలను చదవాలి.

    తెలంగాణ హిస్టరీ, మూవ్​మెంట్​ - తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల ద్వారా తెలంగాణ హిస్టరీ, మూవ్​మెంట్ ప్రిపేర్​ అవ్వాలి. గ్రూప్ I, గ్రూప్ II లకు వి ప్రకాష్ రాసిన ఫార్మేషన్​ ఆఫ్​తెలంగాణ బుక్​ బాగా ఉపయోగపడుతుంది.

    తెలంగాణ సొసైటీ, కల్చర్​, హెరిటేజ్​, ఆర్ట్స్​ అండ్​ లిటరేచర్​ - ఈ అంశాలు తెలంగాణ చరిత్రలో ఒక భాగం. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలతో ప్రిపేర్​ అవ్వాలి.

    తెలంగాణ రాష్ట్ర విధానాలు - తెలంగాణ ప్రభుత్వం 2 జూన్ 2014 నుండి ప్రారంభించిన అన్ని పాలసీలను తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి. ఈ పాలసీలు తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వేలో వివరంగా ఉంటాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Exams, Group 1, Preparation, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు