హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-1 Prelims Hall tickets: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ల విడుదల, పరీక్ష వాయిదాపై కీలక అప్డేట్..

TSPSC Group-1 Prelims Hall tickets: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్ల విడుదల, పరీక్ష వాయిదాపై కీలక అప్డేట్..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అక్టోబర్ 26న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. హాల్ టికెట్ల విడుదల, పరీక్ష వాయిదాకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాష్ట్రంలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (TS Job Notifications) విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 503 గ్రూప్-1 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విడుదలైన తొలి గ్రూప్-1 (TSPSC Group-1) నోటిఫికేషన్ ఇదే కావడంతో అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 503 ఖాళీలకు గాను 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే.. పరీక్షకు నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.

  ఎలాంటి అవకతవకలు, లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఈ గ్రూప్-1 పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపారు. హాల్ టికెట్లు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో విడుదల చేయనున్నారు. ప్రిలిమ్స్ తర్వాత అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి నెలలో మెయిన్స్ నిర్వహించనున్నారు.

  TSPSC Group 1: గ్రూప్ 1 పరీక్ష కేంద్రాల ఏర్పాటులో అధికారులు.. ప్రిలిమ్స్ లో 1:50 ఇలా..

  ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖలో(Panchayat Raj Department) కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ సర్కార్. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు(Hanumanth Rao) ఇటీవల జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జూనియర్ అసిస్టెంట్ 253, సూపరింటెండెంట్ 103, సీనియర్ అసిస్టెంట్ 173 పోస్టులు ఉన్నాయి. మొత్తం 529 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు.

  కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులను అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ జూనియర్ అసిస్టెంట్ పొస్టులను గ్రూప్ 4 కింద భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 4 కింద నోటిఫై చేసిన 9వేల పైచిలుకు పోస్టుల్లో వీఆర్ఓల భర్తీ కారణంగా ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటి స్థానాల్లో ఈ కొత్త పోస్టులను ప్రభుత్వానికి చూపించనున్నట్లు సమాచారం.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC, Tspsc jobs

  ఉత్తమ కథలు