తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు (TSPSC Group 1) సంబంధించిన కొలువుల జాతర మొదలైంది. ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ను (TSPSC Job Notification) తాజాగా విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల గ్రూప్ 1 కు సంబంధించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. దీంతో కేవలం 900 మార్కులకే మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.
అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన హైలెట్స్ ఇలా ఉన్నాయి..
-టీఎస్పీఎస్సీ మొదటి సారి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
-మొదటి సారి ఇంత మొత్తంలో అంటే ఏకంగా 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా తొలిసారి.
దరఖాస్తు ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
-ఎంపికు సంబంధించిన ఎగ్జామ్ రెండు స్టెప్స్ లో ఉంటుంది. ఇందులో ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) మొదటిది.. రెండవది రాత పరీక్ష (మెయిన్స్) ఉంటుంది.
-ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది జులై/ఆగస్టు నెలలో ఉండే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
-రాత పరీక్ష (మెయిన్స్) నవంబర్/డిసెంబర్లో ఉంటుందని వెల్లడించారు.
-గ్రూప్ ఎగ్జామ్ కు అప్లై చేసుకోవడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది.
-నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థులు విద్యార్హతలను పొంది ఉండాలి.
-మొదటి సారిగా గ్రూప్ 1 ఉద్యోగాల్లో EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్లను ఈ సారి వర్తింపజేయనున్నారు.
-మొదటిసారిగా గ్రూప్1 ఎగ్జామ్ ను ఈ సారి ఉర్దూలో సైతం నిర్వహించనున్నారు అధికారులు.
-ఈ సారి మెయిన్ ఎగ్జామ్ కు ‘‘ఈ-క్వశ్చన్’’ పేపర్ ను అందించాలని కమిషన్ యోచిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.