తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) ఏప్రిల్ లో విడుదలైంది. ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు అధికారులు. తమ కలల గ్రూప్ 1 కొలువు సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే ప్రిపరేషన్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సిలబస్ (TSPSC Syllabus) కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ (Prof Haragopal) కొన్ని రోజుల క్రితం ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సిలబస్ పై పలు అంశాలను వివరించారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర భౌగోళిక స్వరూపం, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ మారుతుందన్నారు. తెలంగాణలో పని చేసే అధికారికి తెలంగాణ జనాభా, ఏ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు తదితర అంశాలపై పట్టు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ చరిత్ర ఏంటి? ఇక్కడ ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరగాల్సి వచ్చిందో తెలుసుకోవాలని వివరించారు.
తెలంగాణ భాష గురించి, తెలంగాణ సంస్కృతి, పండుగల గురించి తప్పక తెలుసుకోవాలన్నారు. ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఈ అంశాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతిలోని విశిష్టతను తెలుసుకవాల్సి ఉందన్నారు. ఇంకా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆర్టికల్ కు సంబంధించిన చరిత్ర, ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యంగంపై పట్టు ఉండాలన్నారు. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 కు సంబంధించిన చారిత్రక నేపథ్యాలను తెలుసుకోవాలన్నారు.
TSPSC: ఈ సారి గ్రూప్ 1 పరీక్షలో ఈ-క్వశ్చన్ పేపర్ విధానం? పూర్తి వివరాలివే.. తెలుసుకోండి
తెలంగాణ ఆర్థిక, రాజకీయ చరిత్రపైన అవగాహన ఉండాలన్నారు. ఈ అవగాహన ఉంటే అభ్యర్థులు ఉద్యోగం సాధించిన తర్వాత విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, భాష, పండుగలకు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే సిలబస్ లో మార్పులు చేసినట్లు చెప్పారు హరగోపాల్. మాథ్స్ విషయానికి వస్తే హైస్కూల్ స్టాండర్డ్ కు అనుగుణంగా సిలబస్ ను రూపొందించినట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 1, JOBS, Telangana government jobs, TSPSC